సంక్షేమ పథకాలు అమలు చేయడం లో మండల స్థాయి, మునిసిపల్ అధికారులు నిబద్ధతను చూపాలి

 


ఏలూరు (ప్రజా అమరావతి);


ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం లో మండల స్థాయి, మునిసిపల్  అధికారులు నిబద్ధతను చూపాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ లు చేపట్టడం లేదని, ఇకపై వారం వారం నివేదిక ఇచ్చి, వివరాలు వెబ్సైట్ లో అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు.


సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరం నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్, ఉపాధి హామీ పనిదినాలు, హెల్త్ క్లినిక్, ఆర్భికెలు, జగనన్న తోడు , టిడ్కో గృహ రుణాలు, ఓటీఎస్, హౌసింగ్, తదితర అంశాలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, ఉపాధిహామీ పథకం కింద నూరు శాతం పనిదినాలు కల్పన కోసం పనిచెయ్యడం ద్వారా మెటీరియల్ కంపోనెంట్ కి నిధులు సమీకరణ చెయ్యాల్సి ఉందన్నారు. మండల , పురపాలక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను, పధకాలు అమలులో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. టిడ్కో ఇళ్ల కోసం నిర్దేశించిన లక్ష్యాల మేరకు గ్రౌండింగ్ పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. నూరుశాతం టిడ్కో ఇళ్ళు పూర్తి చేసిన వాటికి బ్యాంకు రుణాలు మంజూరు చేయించి, అందచెయ్యలన్నారు. స్పందన ఫిర్యాదులు విషయంలో ప్రజా సమస్యలపై, ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపాల్సి ఉందన్నారు.  డివిజన్, మండల స్థాయి అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల సందర్శించడం జరగడం లేదని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. 


జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా సమీక్షిస్తూ, జిల్లాలో గ్రామ సచివాలయ పరిధిలో 938 కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ లు నిర్మాణం చేపట్టవలసి ఉండగా ఇప్పటి వరకు 595 వాటికి మాత్రమే స్థలం గుర్తించడం జరిగిందన్నారు. ఇక వాటికి సంబంధించిన టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలి. ఉపాధిహామీ పథకం కింద ప్రతి రోజు లక్ష 25 వేల పనిదినాలు కల్పించాలని సూచించారు. కేవలం అత్యధికంగా 30 శాతం కుటుంబాలకు 100 శాతం పని దినాలు కల్పించాగా, జిల్లాలో సగటున 10 శాతం కుటుంబాలకు మాత్రమే 100 రోజుల  ఉపాధి హామీ పని దినాలు కల్పించగలిగారన్నారు.


వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణాలు 134  పూర్తి చేసుకున్న, కేవలం ఇప్పటి వరకు 48 భవనాలు మాత్రమే అప్పగించడం జరిగిందన్నారు. మిగిలిన భవనాలు కూడా జనవరి 26, జనవరి 30 లోగా మిగిలిన భవనాలు అప్పగించడం పూర్తి అవ్వాలన్నారు. అదేవిధంగా పూర్తిచేసిన అర్భికే భవనాలు కూడా తక్షణమే వ్యవసాయ శాఖ కు అప్పగించాలన్నారు. ఎంపీడీఓ లు వ్యక్తి గత పర్యవేక్షణ చేయ్యడం, క్షేత్రస్థాయిలో పర్యటన చెయ్యడం లో వ్యక్తిగత భాద్యత తీసుకోవాలని ఆదేశించారు.జగనన్న తోడు కింద 64 వేలమంది లబ్దిదారులకి గాను 57 వేలమంది బ్యాంకులు రుణాలు మంజూరు చెయ్యడం జరిగిందని, మిగిలిన రుణాలు మంజూరు కి ఎల్డిఎం సమీక్షించి, సంబంధించిన ఎంపీడీఓ  గ్రౌండింగ్ పూర్తి చేయాలని హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. స్పందన ఫిర్యాదు ల పరిష్కారం కి రాష్ట్ర స్థాయి సగటు కంటే మెరుగైన విధానంలో పరిష్కారం చెయ్యాల్సి ఉందని హిమాన్షు శుక్లా తెలిపారు. స్పందనకు వోచ్చే ఫిర్యాదులు పరిష్కారం చేసినట్లు చూపినా, మరల మరల రావడం పై సరైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. స్పందన ఫిర్యాదులు వివరాలు సక్రమంగా నమోదు చెయ్యాల్సి ఉందన్నారు. రెవెన్యూ కి సంబంధించిన భూమి సమస్యలు, మునిసిపల్ లో వీధి దీపాలు, పీఆర్  భూ ఆక్రమణ, శానిటేషన్ , ఆర్డబ్ల్యూఎస్ , గృహ నిర్మాణ శాఖ వంటి ఫిర్యాదు లపై స్పష్టంగా వివరణ ఇవ్వాలి. ఓటీఎస్ కి సంబంధించిన పెండింగ్ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 95 వేల ఇళ్ళు బిపిఎల్ స్థాయి లో ఉన్నాయి, వారానికి 5వేలు టార్గెట్ నిర్దేశించి పనులు చేపట్టాలన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్నీ సేవాభావంతో చేపట్టాల్సి ఉందన్నారు. ఫ్రెంట్ లైన్ వారియర్స్ సేవాలు అభినందనీయం అన్నారు.


జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.బి ఆర్. అంబేద్కర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్యాక్ సెంటర్ పరిధిలో నిర్మాణాలు చేపట్టవలసిన 121 గోడౌన్లలో 98 వాటికి సంబంధించిన వివరాలు అప్లోడ్ చెయ్యడం జరిగిందన్నారు. మిగిలిన 23 స్థలాలు విషయంలో సేకరణ వేగవంతం చేస్తున్న ట్లు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి గోడౌన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఏలూరు నుంచి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యక్షంగా, డివిజన్, మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.Comments