ఎన్ని పనులున్నా "పసివాడి" బాధ్యత మరవని మంత్రి మేకపాటి




ఆత్మకూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా(ప్రజా అమరావతి);.


*ఎన్ని పనులున్నా "పసివాడి" బాధ్యత మరవని మంత్రి మేకపాటి



*ఇచ్చిన మాటకు కట్టుబడి...అన్నట్లుగానే అండగా నిలబడి..*


*నవదీప్ ఇంటికి వెళ్లి సంక్రాంతి పండుగకు కొత్త వస్త్రాల బహూకరణ*


*ఇటీవల సంగం మండలంలో జరిగిన ఆటో ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి*


ఆత్మకూరు, జనవరి, 01 : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరోసారి తన మంచి మనసును తన చేతల ద్వారా చాటిచెప్పారు. రకరకాల పనులతో తీరిక లేకున్నా తాను మాటిచ్చిన జ్యోతినగర్ కు చెందిన నవదీప్ బాధ్యతను మాత్రం మరవలేదు. ఇటీవల సంగం మండలంలో బీరాపేరువాగు వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన నవదీప్ అనే చిన్నారికి తాను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రూ.10 లక్షల సొంత నిధులను ఖాతలో జమచేశారు. శనివారం కొత్త సంవత్పరం ఆరంభమయిన సందర్భంగా  ఇంటికి వెళ్లి మరీ మంత్రి గౌతమ్ రెడ్డి నవదీప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఆ చిన్నారి కోసం తీసుకువచ్చిన కొత్త బట్టలను మంత్రి మేకపాటి స్వయంగా  అందజేశారు. పరామర్శకు వచ్చిన సందర్భంలో ప్రకటించినట్లుగానే మంత్రి మేకపాటి స్వయంగా నవదీప్ ఆలన పాలన చూస్తుండడం చూసి కాలనీవాసులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. 



Comments