కాశీబుగ్గ (ప్రజా అమరావతి);
శ్రీ గురుకుల విద్యాలయం - వైజ్ఞానిక ఉత్సవం 2022 _అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవం_
* కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభం చేసిన రాష్ట్ర మంత్రివర్యులు *డాక్టర్ సీదిరి అప్పలరాజు* గారు, ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనలు తిలకించారు అనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ 21వ దశబ్దపు విద్యావ్యవస్థలో సమూల మార్పులకై జాతీయ స్థాయిలో అనేక విధానాలను భారతదేశం అవలంబిస్తోందని అందులో భాగమే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ కాశీబుగ్గ గురుకుల పాఠశాలలో ప్రారంభోత్సవం చేసుకోవడం ఆనందంగా ఉందని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన అవసరమని ప్రపంచ దేశాలతో పోటీ పడి విప్లవాత్మక మార్పులకు భారత సాంకేతిక రంగం పోటీ పడటం గర్వకారణమని అన్నారు.
కార్యక్రమంలో ఆయనతో పాటుగా మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, విధ్యాశాఖాధికారి శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ అశోక్ కుమార్, వ్యవస్థాపకులు కృష్ణమూర్తి, అకడమిక్ అడ్వైజర్ సతీష్, కౌన్సిలర్లు సనపల సింహాచలం, గుజ్జు జోగారావు, బెల్లాల శ్రీనివాస్, కో-ఆప్సన్ సభ్యులు గౌరి త్యాడి, బమ్మిడి సంతోష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment