హైకోర్టులో 7గురు నూతన న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన హైకోర్టు సిజె.పికె.మిశ్రా
అమరావతి,14 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సోమవారం ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి,జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్,జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ,జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు,జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి,జస్టిస్ రవి చీమలపాటి,జస్టిస్ వడ్డిబోయన సుజాత లచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం,హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి,బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు,అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ హరనాధ్,పలువురు రిజిస్ట్రార్లు,న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment