జెడ్పీటీసీ మరియు ఎంపీపీ సభ్యులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమము

 గుంటూరు (ప్రజా అమరావతి); జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నందు,జిల్లా లోని అందరు జెడ్పీటీసీ మరియు ఎంపీపీ సభ్యులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమము


జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ జి. శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన జరిగినవి.


     ఈ కార్యక్రమంలో భాగంగా  వైస్ చైర్మన్స్ శ్రీ శోంటిరెడ్డి నర్సిరెడ్డి గారు మరియు బత్తుల అనురాధ గారు ఇటీవల స్వర్గస్తులైన  మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాలులు అర్పించారు.


      తరువాత ఈ శిక్షణా కార్యక్రమములో భాగం గా  వివిధ శాఖల అధికారులు వారి వారి పరిధిలోని కార్యక్రమము ల పై  జిల్లా పరిషత్ సభ్యులకు, మండల ఆధ్యక్షులకు అవగాహనా కల్పించడం జరిగింది.

       ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో శ్రీ జి.శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ సభ్యలందరు ప్రతీ ప్రభుత్వ కార్యక్రమము పై అవగాహన కల్గియండాలని,మరియు జగనన్న స్వచ సంకల్పం కార్యక్రమము పై భాగస్వాములు కావాలని తెలియజేశారు.

Comments