కాకాణి చేతులు మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కొలనకుదురు, కట్టువపల్లి గ్రామాలలో పర్యటించి ఒక కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
గ్రామ సచివాలయాన్ని సందర్శించి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ప్రజల సమక్షంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించి, సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకాణి.
పురాతనమైన శ్రీ వాహనేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి.
అంగన్వాడి, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులు, చిన్నారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే కాకాణి.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని, నా విజ్ఞప్తిని మన్నించి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి నిత్యం కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం చూస్తుంటేనే, సర్వేపల్లి నియోజకవర్గం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో, ప్రజలకు అర్థమవుతుంది.
తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా గ్రామాలలో తిరగలేకపోయినా, వైకాపా ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యునిగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అర్హులైన వారందరికీ అందిస్తున్నాం.
దేవాలయాలకు ధర్మకర్తల మండలిలో 50 శాతం మహిళలను నియమించడంతో పాటు, 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
అంగన్వాడి చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.
అంగన్వాడీ చిన్నారుల సంరక్షణ పట్ల అలసత్వం ప్రదర్శిస్తే, ఉద్యోగాల నుండి తొలగించడం జరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో *"నాడు - నేడు"* పథకం ప్రవేశ పెట్టడంతో స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, పని చేస్తాం.
addComments
Post a Comment