ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవాలి

 *ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవాలి*


*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*


*: కుణుతూరు జగనన్న హౌసింగ్ లేఔట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్*


ధర్మవరం (అనంతపురం), ఫిబ్రవరి 16 (ప్రజా అమరావతి):


జగనన్న హౌసింగ్ లేఔట్ లో పనులు వేగవంతంగా జరగాలని, ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం ధర్మవరం మండల పరిధిలోని కుణుతూరు గ్రామం వద్ద నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుణుతూరు జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కుణుతూరు జగనన్న హౌసింగ్ లేఔట్ లో 1908 ప్లాట్లు అర్బన్ కి సంబంధించినవి కాగా, ఇప్పటివరకు 57 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలన్నారు. ఈ లేఔట్ లో పనులు సక్రమంగా జరిగినట్లు కనిపించడం లేదని, వెంటనే అన్ని ఇల్లు బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. అలాగే కుణుతూరు లేఔట్ లో రూరల్ కు సంబంధించి కూడా ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలన్నారు. కుణుతూరు జగనన్న హౌసింగ్ లేఔట్ వద్ద కాంట్రాక్టర్ తో మాట్లాడి ఇటుకల పరిశ్రమని త్వరగా పట్టించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ లేఔట్ లో నీటి వసతి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అధికారులు సమయం చేస్తున్న పని చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ పనులు స్టేజీల వారిగా పూర్తయిన అనంతరం బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించి పనులు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టే లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించాలన్నారు.

  

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్, కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ నీలకంఠారెడ్డి, హౌసింగ్ ఈఈ చంద్రశేఖర్, డిఈ మునీశ్వర నాయుడు, ఎఈలు బాలాజీ శేషవలి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments