దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పార్ధివ దేహానికి నివాళులర్పించిన:సిఎస్ డా.సమీర్ శర్మ

 దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పార్ధివ దేహానికి నివాళులర్పించిన:సిఎస్ డా.సమీర్ శర్మ


అమరావతి,22 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):సోమవారం హైదరాబాదులో హఠాన్మరణం చెందిన రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటి శాఖామాత్యులు మేకపాటి గౌతం రెడ్డి పార్ధివదేహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ నివాళులర్పించారు.మంగళవారం ఆయన నెల్లూరులోని మంత్రి వర్యుల స్వగృహాన్ని సందర్శించినే సిఎస్ డా.సమీర్ శర్మ దివంగత రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పార్ధివ దేహానికి నివాళులు అర్పించి తీవ్ర సంతాపాన్నివ్యక్తం చేశారు.అనంతరం దివంగత మంత్రివర్యుల పితృమూర్తి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    

Comments