- సచివాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాలపై కేబినెట్ సబ్ సమిటీ సమావేశం
- సమావేశంలో పాల్గొన్న పిఆర్&ఆర్డీ శాఖమంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) శ్రీ ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు
- హాజరైన ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం, సిసిఎల్ఎ జి.సాయిప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిదార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, ఎపి హౌసింగ్ కార్పోరేషన్ ఎండి నారాయణ్ భరత్ గుప్తా, డిఎంజి విజి వెంకటరెడ్డి, డిటిసిపి డైరెక్టర్ ఆర్ జె విద్యుల్లత తదితరులు.
అమరావతి (ప్రజా అమరావతి):
- సచివాలయంలోని మూడోబ్లాక్ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
- ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) శ్రీ ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ అజేయ్ కల్లాం పాల్గొన్నారు.
- సిసిఎల్ఎ, సర్వే అండ్ సెటిల్ మెంట్, రెవెన్యూ, మున్సిపల్స్, టౌన్ ప్లానింగ్, పంచాయతీరాజ్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ, అటవీశాఖలకు చెందిన అధికారులు సమావేశంకు హాజరయ్యారు.
- ఈ సందర్బంగా వివిధ శాఖల అధికారులు పథకం అమలుపై మంత్రుల కమిటీకి ప్రజంటేషన్ ఇచ్చారు.
- రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1277 గ్రామాల్లో డ్రోన్ ల ద్వారా సర్వే మ్యాప్ ల కోసం చిత్రాలు తీసే ప్రక్రియను పూర్తి చేశామన్న అధికారులు.
- మొత్తం 3211 హేబిటేషన్ ల పరిధిలో 6843.81 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్ సర్వే పూర్తయ్యిందని వివరించిన అధికారులు.
- ఇప్పటి వరకు 51 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేశామన్న అధికారులు.
- గ్రామకంఠం కుసంబంధించి డిపిఓలకు అవసరమైన సూచనలు చేశామన్న అధికారులు.
- సర్వే ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు బేస్ స్టేషన్లు ఏర్పాటు, సిగ్నల్స్ లేని చోట పనిచేసే రోవర్స్ ను కూడా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
- భూవివాదాల పరిష్కారం కోసం ఇప్పటికే మొబైల్ మేజిస్ట్రేట్ లకు శిక్షణ పూర్తయ్యిందన్న అధికారులు.
- అర్బన్ ఏరియాల్లో అధికారులకుకూడా పదిరోజుల శిక్షణ కూడా ప్రారంభించామని తెలిపిన అధికారులు.
- త్వరలోనే వార్డు, ప్లానింగ్ సెక్రటరీలకు కూడా శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామన్న అధికారులు.
- జగన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం అమలులో ఇప్పటికే సర్వే పూర్తి చేసిన గ్రామాల నుంచి ఎదురైన సవాళ్ళను సమీక్షించుకుని, వాటిని పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రులు.
- అటవీభూముల సరిహద్దులను గుర్తించాలని, అలాగే ప్రభుత్వ భూములను అక్రమించి తప్పుడు ధ్రువపత్రాలను పొందిన వారిని కూడా ఈ సర్వే ప్రక్రియలో గుర్తించాలన్న అధికారులు.
- ఇప్పటికే గ్రామకంఠంకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలతో అధికారులు పనిచేస్తున్నారని, అర్భన్ ఏరియాల్లో సర్వే సందర్భంగా ఎక్కువగా భూవివాదాలు ఎదురవుతాయని, వాటిని కూడా నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని అన్నారు.
- సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, అవసరమైతే డ్రోన్ కార్పోరేషన్ సహకారంతో ఎక్కువ డ్రోన్ లను వినియోగించడం ద్వారా అనుకున్న సమయం లోగా సర్వే పూర్తి చేయాలని కోరారు.
----------------------------
*అనంతరం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై మంత్రుల కమిటీ సమీక్షించింది.*
- సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 42.4 లక్షల మందికి మేలు జరుగుతుందని వివరించిన అధికారులు.
- దీనికి సంబంధించి ఇప్పటికే నూరుశాతం డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేశామన్న అధికారులు.
- పంచాయతీ కార్యదర్శులు, విఆర్వో నుంచి 99 శాతం అనుమతుల ప్రక్రియ పూర్తయ్యిందని వివరించిన అధికారులు.
- ఇప్పటి వరకు పది లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకంను వినియోగించుకున్నారని, వీరిలో 4.97 లక్షల మందికి డాక్యుమెంట్లు కూడా రిజిస్టర్ చేశామన్న అధికారులు.
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి 2.83 లక్షల మందికి వారి డాక్యుమెంట్లకు అనుమతులు లభించాయన్న అధికారులు.
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వీరికి గతంలో ఉన్న 22ఎ జాబితా నుంచి సదరు భూములను తొలగించడం జరిగిందన్న అధికారులు.
- గ్రామ, పట్టణ స్థాయిల్లో ఈ పథకంను వినియోగించుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్న అధికారులు.
- సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా తమ ఇళ్ళకు సంబంధించిన అన్ని హక్కులు లబ్ధిదారులకు లభిస్తాయని, ఒకమంచి ఆస్థిని వారు సమకూర్చుకునేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్న మంత్రులు.
- దీనిపై గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు వివరిస్తే, వారే ముందుకు వచ్చి ఈ పథకంను వినియోగించుకుంటారన్న మంత్రులు.
- ఈ మేరకు లబ్ధిదారుల్లో చైతన్యంను పెంచాలని, నామమాత్రపు రుసుంతోనే అన్ని హక్కులతో తమ ఇళ్ళకు రిజిస్ట్రేషన్ సదుపాయం, తిరిగి ఇతరులకు విక్రయించుకోవడం, బ్యాంకుల ద్వారా రుణాలు పొందే వీలు ఉంటుందని, సీఎం శ్రీ వైయస్ జగన్ పేదలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకువచ్చారన్న మంత్రులు.
- రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించిన మంత్రులు.
addComments
Post a Comment