*కష్టం వస్తే కాపాడే మనిషి జగనన్న
*
*కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన ఆడపిల్లలకు అండగా ప్రభుత్వం*
*ఒక్కో బాలికకు రూ.10 లక్షలు చొప్పున ఇద్దరు బాలికలకు 20 లక్షల రూపాయలు మంజూరు*
*చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని .
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ఆదుకుంటున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలకు ఒక్కొకరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు మంజూరవగా... బాధిత బాలికలకు శనివారం ఆ మొత్తాన్ని స్థానిక శాసనసభ్యురాలు విడదల రజిని గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టణంలోని 19వ వార్డుకు చెందిన కల్లూరి వరదరాజు, కల్లూరి ఉమామహేశ్వరి దంపతులిద్దరు కరోనా కారణంగా మరణించారని తెలిపారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, స్థానిక శారదా హైస్కూల్లో కె.మహిమ 8 వ తరగతి, కె. అనుపమ 7 వ తరగతి చదువుతున్నారని చెప్పారు.ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గారు చిన్నారులిద్దరికీ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేశారని పేర్కొన్నారు. చిన్నారుల కష్టాన్ని తన కష్టంగా భావించి జగనన్న ఈ సాయం అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగనన్నకు ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాలికలిద్దరికీ హెల్ప్ చారిటబుల్ ట్రస్టు తరఫున ఒక్కొకరికి రూ.50 వేలు చొప్పున మంజూరయ్యేలా కృషి చేశామన్నారు. కార్యక్రమంలో సీడీపీవో మాణిక్యరావు,సూపర్వైజర్ విజయకుమారి,సామ్రాజ్యం,అంగన్వాడీ టీచర్ సయ్యద్ షర్మిల మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్లు కొలిశెట్టి శ్రీనివాసరావు,వలేటి వెంకటేశ్వర్లు,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహ ఖాన్, స్థానిక కౌన్సిలర్ నసీమ బేగం,సయ్యద్ ఆలీ మరియు పలువురు ఉన్నారు.
addComments
Post a Comment