రెండో విడత నాడు నేడు పనులు ప్రారంభించాలి.
అదనపు తరగతి గదులకు అంచనాలు రూపొందించండి.
2022-23 కు గదులు సిద్ధం కావాలి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు - నేడు కార్యక్రమం రెండో విడత పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ శేషగిరిబాబు, మౌళిక వసతుల సలహాదారు మురళి, ఏపీఈడబ్ల్యూ ఐడిసి ఎండి దివాన్ రెడ్డి, సిఈ నాగరాజు, నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
జెఈఈ మెయిన్, ఇంటర్ పరీక్షలు తేదీలు ఒకేరోజు వస్తున్న కారణంగా ఇంటర్ పరీక్షల తేదీలు మార్పు అంశం పై సమీక్షించారు.
జగనన్న విద్యాకానుక సన్నద్దత పై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.....
2022-23 విద్యాసంవత్సరానికి అదనపు తరగతి గదులు నిర్మాణం పూర్తి చేయాలి.
పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులకు సంబంధించి అంచనాలు వెంటనే రూపొందించాలి.
పరిపాలన అనుమతులు తీసుకొని వెంటనే పనులు ప్రారంభించాలి.
జాతీయ విద్యావిధానం అమలుకు తరగతి గదులు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది.
రెండో విడత ఎంపిక చేసిన పాఠశాలల్లో అన్ని మౌళిక వసతుల కల్పనతో పాటు సీబీఎస్ఈ నిభందనలు అమలుకు చర్యలు తీసుకోవాలి.
addComments
Post a Comment