శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): ఈ రోజు అనగా ది.08-03-2022 న ప్రతి మాసము నందు వచ్చు శుద్ధషష్టి సందర్భముగా దేవస్థానములో నటరాజ స్వామి మండపము దగ్గర ఆలయ అర్చకులు శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి వార్ల కళ్యాణమును శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగినది. కళ్యాణం నందు భక్తులు సామాజిక దూరం పాటిస్తూ పాల్గొని పూజలు నిర్వహించారు..
addComments
Post a Comment