వివేకానంద మరణంపై చంద్రబాబు కుట్రపూరిత వ్యూహం
సీబీఐ, ఎల్లో మీడియాతో కలిసి బురద చల్లుతున్నారు
అందుకే సీబీఐ ఒకే ఒక లక్ష్యంతో పని చేస్తోంది
కేసులోకి నేరుగా శంకర్‌రెడ్డిని, ఆ తర్వాత అవినాష్‌రెడ్డిని..
చివరగా జగన్‌గారిని లాగాలన్న ఉద్దేశంతో పని చేస్తున్నారు
వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి
సునీతమ్మ చంద్రబాబు చేతిలో పావులా మారారు
ఇప్పుడు ఆయనతో కలిసి పాత్రధారులూ అయ్యారు
అందుకే సునీతమ్మ, ఆమె భర్త ఒకేలా మాట్లాడుతున్నారు
ఇందుకు వివేకానందరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది. అదే మా బాధ
శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ
జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ కుట్రలు
ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్నారు
వివేకానందరెడ్డిగారిని మా పార్టీ ఎంతో గౌరవిస్తుంది
అందుకే ఇప్పటి వరకు మేము మాట్లాడడం లేదు
అయినా మీరు పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు
మేం అడిగిన 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు
సూటిగా ప్రశ్నించిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి
నిజానికి ఆనాడు వివేకానందరెడ్డిపై రాసిందీ వారే
ఆయన రెండోపెళ్లి చేసుకున్నారంటూ కధనాలు
ఏవో ఫోటోలనూ ప్రచురించారు. ఏదేదో రాశారు
అప్పుడు వివేకానందరెడ్డి ఫ్యామిలీ వారి టార్గెట్
ఇవాళ జగన్‌గారిపై బురద చల్లేలా క«ధనాల ప్రచురణ
సునీతమ్మ, ఆమె భర్త వాంగ్మూలాలంటూ కధనాలు
పేజీలకొద్దీ కుమ్మరిస్తూ తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారు
ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి (ప్రజా అమరావతి):
ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమేం అన్నారంటే..:
దారి మళ్లిన దర్యాప్తు:
గత కొన్ని నెలలుగా మా పార్టీ నాయకుడు వివేకానందరెడ్డి హత్య గురించి అవాకులు, చెవాకులు పేలుతున్నారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయిన తర్వాత, అంటే 2020 మార్చి తర్వాత దర్యాప్తు రెండు, మూడు నెలలు ఒక పద్ధతిలో సాగింది. ఆ తర్వాత పూర్తిగా దారి మళ్లింది. ఒక్కసారిగా మా పార్టీ యువ ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈ హత్యలో ప్రమేయం ఉందని చెబుతున్నారు. నిజానికి ఆనాడు అవినాష్ గెలుపు కోసం వివేకానందరెడ్డి కృషి చేశారు. టీడీపీ, ఆ పార్టీ అ«ధ్యక్షుడు చంద్రబాబు నడుపుతున్న రాజకీయాలు ఇవాళ మరో మలుపు తీసుకున్నాయి.
తొలి నుంచి కుట్రలు:
1999 తర్వాత సూట్‌కేసు బాంబు, అంతకు ముందు రాజారెడ్డి హత్య కేసు, ఇంకా వైయస్సార్ అక్రమ మైనింగ్ అని రకరకాలుగా ప్రచారాలు చేశారు. శూన్యం నుంచి ఏదో సృష్టిస్తున్నారు. జనం మెదడుల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నింటికి మించి వైయస్సార్‌గారి దుర్మరణం తర్వాత జగన్‌గారు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక నాటకానికి బీజం వేసి, నడుపుతూ వస్తున్నారు. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌తో కలిసి, స్వయంగా స్క్రిప్ట్ రాసి టీడీపీ రాజకీయం చేస్తోంది.
ప్రజలు, ప్రజాకోర్టు టీడీపీకి అడ్రస్ లేకుండా చేసినా బుద్ది రాకుండా దాదాపు మూడేళ్లుగా అదే రాజకీయం చేస్తున్నారు.
చంద్రబాబు, ఆయన మీడియా కలిసి కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఉన్న విలనిజమ్, దుర్మార్గం.. వాటికి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా.. ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకుని, రాజకీయంగా తీసుకుపోవాలని విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు.
స్క్రిప్ట్ ప్రకారం..!:
చివరకు ఆ హత్య కేసును పూర్తిగా జగన్‌గారికి ఆపాదిస్తున్నారు. ఆ ప్రకారమే స్క్రిప్ట్ రాస్తున్నారు. ఇక్కడ స్కి ప్ట్ అని ఎందుకు అంటున్నామంటే, సీబీఐ వారి సీఆర్పీసీ–161 రిపోర్టులు. వాటిని ఎవరు చదివినా సరే స్పష్టంగా ఒక్కటే అర్ధమవుతుంది.
సాక్ష్యులు స్పష్టంగా చెప్పినట్లుగా లేకపోయినా.. ఈనాడు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 రోజూ విడుదల చేస్తున్న వాంగ్మూలాలు చూస్తుంటే.. దాని నుంచి టీడీపీ స్పందన. ఆ తర్వాత ట్వీట్లు ఒక వ్యూహం ప్రకారమే అని అర్థం అవుతుంది.
రాజకీయపరమైన దాడి:
ఆ విధంగా జగన్‌గారి వ్యక్తిత్వాన్ని హననం (క్యారెక్టర్ అస్సాసినేషన్) చేయాలని చూస్తున్నారు. ఆయనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ పని చేస్తున్నారు. అందుకే దీన్ని రాజకీయపరమైన దాడిగా మేము భావిస్తున్నాం.
దర్యాప్తు ఎలా జరుగుతున్నది అన్నది ఒక అంశమైతే, ఈ ముఠా ఆ ప్రక్రియను చేతిలో పెట్టుకుని, పూర్తిగా దారి మళ్లించే ప్రయత్నం చేస్తోంది అన్నది మరో అంశం. ఆ కుట్రను ఇవాళ మీడియా ద్వారా విజ్ఞులైన ప్రజలకు తెలియజేయాలనే ముందుకు వచ్చాం.
అనివార్యంగా మాట్లాడాల్సి వస్తోంది:
మేము ఇంతకాలం ఏవైతే, మేము అత్యంత గౌరవించే కుటుంబంలో భాగమైన వ్యక్తుల గురించి మాట్లాడకూడదని అనుకున్నామో.. అవినాష్‌రెడ్డితో సహా.. కానీ ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది.
ముఖ్యంగా.. సీఆర్పీసీ–161 పేరుతో సీబీఐ రికార్డు చేసిందని, అవి కోర్టు ద్వారా రిలీజ్ అయ్యాయని ఆ పత్రికల్లో వస్తున్న విషయాలు. వివేకానందరెడ్డి కుమార్తె సునీతమ్మ, ఆయన భర్త రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలాలు బయటకు వచ్చాక.. వారు ఏ విధమైన జంకు లేకుండా అవినాష్‌రెడ్డివైపు వేలు చూపిన తర్వాత, ఇది వ్యక్తిగతమైందని మేము అనుకోవడం లేదు. అందుకే మౌనంగా ఉండకూడదని మాట్లాడుతున్నాం.
వారు పావులుగా మారారు:
విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.. జగన్నాటకం ఆడిస్తున్న చంద్రబాబు చేతిలో పావులుగా మారారో లేక ఈ క్యారెక్టర్లు (సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి) ఆయనతో సహ పాత్రులో తెలియదు కానీ, ఒక పద్ధతి ప్రకారం ఒకే మాట మాట్లాడుతున్నారు. ఒక హత్య గురించి ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ తయారు చేసినట్లు సీబీఐ కూడా మారడం, ఇవన్నీ తయారు చేయడం చూస్తున్నాం.
అందుకే మౌనం వహించాం:
జగన్‌గారు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన సమాధానం చెప్పలేక కాదు. తమ కుటుంబ సభ్యుల గురించి ఆయనకు మాట్లాడడం ఇష్టం లేదు.
కడపు చింపుకుంటే కాళ్ల మీద పడుతుందని ఆయన స్పందించలేదు.
కానీ వారు ఆయనపై నిందలు వేస్తున్నారు. పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా మేమడిగిన అయిదు ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇవ్వడం లేదు.
అవి ఎంత వరకు వాస్తవం?:
నిజానికి సీబీఐ 161లో వాంగ్మూలం పేరుతో రాసిందని చెబుతున్న వాటిలో వాస్తవం ఎంత ఉందో తెలియదు. కానీ సునీతమ్మ మాట్లాడిందంటూ పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారు. కొత్త కొత్త పాయింట్లు చేర్చి మరీ రాస్తున్నారు. నిజానికి వాంగ్మూలాన్ని చెక్ చేస్తే, అనని మాటలు కూడా రాస్తున్నారు. ఇంకా ఇంకా సాగదీస్తున్నారు.
ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇష్టం వచ్చినట్లు అచ్చు గుద్దేస్తున్నారు.
మరోసారి నేను ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. నిజంగా సునీతమ్మ, ఆమె భర్త అసలు అన్నారో తెలియదు. కానీ వాళ్లు ఈ వార్తలను ఖండించలేదు కాబట్టి, అన్నారే అనుకోవాలి.
ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాశారు. జగన్‌గారిపై వైజాగ్ ఎయిర్‌పోర్టులో కోడి కత్తి దాడి జరిగిందని, ఆ తర్వాత ఆయనకు చికిత్స పేరుతో సహాయం చేసిన వారికి మంచి పదవులు దక్కాయని వారన్నట్లు రాశారు. కానీ వాంగ్మూలంలో అది కనిపించలేదు. అలాగే హత్యకు ముందురోజు జమ్మలమడుగు వెళ్లి వచ్చిన వివేకానందరెడ్డి, తానే ఎంపీ అని అన్నట్లు, ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు రాశారు. కానీ నిజానికి ఆ విషయం కూడా వాంగ్మూలంలో కనిపించలేదు.
ఆ ప్రస్తావన ఎందుకు లేదు?:
సీబీఐ అనే సీరియస్ దర్యాప్తు సంస్థ, నిజంగా తాము దర్యాప్తు చేస్తున్నప్పుడు, ఎవరైనా రాజకీయంగా మాట్లాడితే యథావిథిగా నోట్ చేస్తారా. అసలు కోడికత్తి అని చెబితే సీబీఐ రాసుకుంటుందా? నిజానికి ఆ మాట అన్నది ఎవరు? టీడీపీ వాళ్లు కాదా?. వివేకానందరెడ్డి హత్య తర్వాత సాయంత్రం వరకు అక్కడ ఉన్న లేఖను బయటపెట్టలేదు. కానీ ఆ ప్రస్తావనే ఛార్జ్‌షీట్‌లో లేదు. అంత దారుణంగా సీబీఐ ఛార్జ్‌షీట్ ఉంది. తలాతోక లేకండా నేరుగా జంప్ చేసి రాశారు. ఎక్కడా పొంతన లేదు.
పరస్పర విరుద్ధం:
వేలిముద్రలు దొరక్కుండా రక్తపు మరకలు తుడిచాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి జైలులో ఉన్నప్పుడు, ఆయనను సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి వెళ్లి కలిశారు. హత్య తర్వాత ఆయన కుటుంబ సభ్యులే ఫోన్ చేస్తేనే అక్కడికి అవినాష్‌రెడ్డి వెళ్తే, ఇప్పుడు ఆయనే నిందితుడు అంటున్నారు. అందుకే వ్యక్తిగతంగా లేదా ఆర్థికపరమైన లేదా రాజకీయపరంగా ఏదో ఒక కుట్ర ఇందులో ఉంది.
జగన్‌గారే వారి టార్గెట్:
2020 మార్చి వరకు జరిగిన సిట్ దర్యాప్తును ఏ మాత్రం పట్టించుకోకుండా, అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఒకే ఒక లక్ష్యంతో పని చేస్తుంది. కేసులోకి నేరుగా శంకర్‌రెడ్డిని, ఆ తర్వాత అవినాష్‌రెడ్డిని చివరగా జగన్‌గారిని లాగాలన్న ఉద్దేశంతోనే పని చేస్తున్నారు. జగన్‌గారిని ఇవాళ ఇన్ని ప్రశ్నిస్తున్నారు కదా. వివేకానందరెడ్డి హత్య తర్వాత రెండు నెలలకు పైగా చంద్రబాబుగారే అధికారంలో ఉన్నారు. అప్పుడు ఆయన నియమించిన బృందమే కేసు దర్యాప్తు కొనసాగింది. అయితే ఆ దర్యాప్తు సక్రమంగా లేకుండా, కుట్రలతో జరుగుతుంటే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఆనాడు ఆ పత్రికలో ఏం రాశారు?:
2019 మార్చి 17న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్తపలుకు రాశాడు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆమె అర్ధరాత్రి ఫోన్ చేసిందని, వివేకానందరెడ్డిది హత్య అని తెలిసినా, సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రాసుకొచ్చారు. వారి ఫోటోలూ ప్రచురించారు. ఆరోజు వివేకానందరెడ్డిగారి కుటుంబం, జగన్‌గారి కుటుంబం ఒకటే కాబట్టి ఆ కోణంలో రాశారు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారని, క్యారెక్టర్ అస్సాసిన్ చేశారు.
సిగ్లూ ఎగ్గూ లేకుండా..:
ఆ విధంగా సిగ్గు, ఎగ్గూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆరోజూ ఛండాలమైన రాజకీయమే. ఇవాళ కూడా అదే. అప్పుడు రెండు కుటుంబాలు ఒకటే కాబట్టి, టార్గెట్ వివేకానందరెడ్డి. ఇవాళ కాస్త దూరం అయ్యాయి కాబట్టి, వివేకానందరెడ్డి కూతురు, అల్లుణ్ని ఎత్తుకుంటున్నారు. చంద్రబాబు వ్యూహం ప్రకారం కధనాలు రాస్తున్నారు.
ఆనాడు వివేకానందరెడ్డి క్యారెక్టర్ అస్సాసినేషన్ చేసిందెవ్వరు? ఇవాళ్టికీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వివేకానందరెడ్డిగారిని గౌరవిస్తోంది అవినాష్‌రెడ్డి, అలాగే వైయస్సార్‌సీపీ. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
ఆ హత్యకు సంబంధించి దస్తగిరి చెప్పిన మాటలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఆస్తులకు సంబంధించి రావాల్సినవి రాకపోతే కక్షతో పోయామని, హత్యలో ఎవరెవరు పాల్గొన్నదీ చెప్పారు. అయితే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను ఓడించారని, దానిపై వివేకానందరెడ్డి కోపంగా ఉన్నారని ఎర్రగంగిరెడ్డి చెప్పారని మాత్రం కొంత వేరే సీఆర్పీసీ–161లో రాశారు. అలాగే అందులో అవినాష్‌రెడ్డి పేరూ చేర్చారు.
అయితే ఇంత జరిగినా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వాంగ్మూలాలు సీఆర్పీసీ–161 కింద తీసుకోరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే వారిని అప్రూవర్‌గా మార్చడం చాలా అరుదని న్యాయ నిపుణులు అంటున్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక:
కేసు ఇంత క్లియర్‌గా ఉన్నా, జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, కేసును ఆయనవైపు మళ్లిçస్తూ, వివేకానందరెడ్డి కూతురు, అల్లుడ్ని తమవైపు తిప్పుకుని హత్య కేసును ఆయనకు ఆపాదిస్తున్నారని అర్ధం అవుతోంది. నిజానికి వారికి ఆ హత్య జరిగినప్పటి నుంచే ఆ సంబంధాలు కొనసాగుతున్నాయా? అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దొరికిన లేఖను సాయంత్రం వరకు ఎందుకు బయటపెట్టలేదు. ఆ వి«షయం శివప్రసాద్‌రెడ్డి అప్పటి ఎంపీ అవినాష్‌రెడ్డికి చెప్పకపోవడం తప్పు కాదా?
నిష్పాక్షిక దర్యాప్తు కోరుకున్నారు:
జగన్‌గారికి తమ కుటుంబ సభ్యులపై గౌరవం ఉంది కాబట్టే, ఇప్పటి వరకు ఆయన మాట్లాడలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా జరగాలని ఆయన కోరుకున్నారు. కానీ నిందితులను కాపాడాలని జగన్‌గారు ప్రయత్నిస్తున్నారని ఆ మీడియా రాస్తోంది.
అధికారంలో ఉన్నప్పటికీ కేసును ప్రభావితం చేయొద్దని, న్యాయబద్ధంగా జరగాలని జగన్‌గారు కోరుకున్నారు. అందుకే ఎక్కడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదు. నిజానికి అప్పటి కాల్ రికార్డులు చూస్తే అన్నీ బయటపడతాయి. దస్తగిరికి లాయర్‌ను ఎవరు నియమించారన్నదీ తెలుస్తుంది.
జగన్‌గారు ఆ నైతికతకు కట్టుబడ్డారు కాబట్టే, ఇవాళ సీబీఐ ఆ విధంగా వ్యవహరిస్తోంది. నిజానికి ఈ కేసును పోలీసులు కూడా ఛేదించే వారు. కానీ సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ కేసును దర్యాప్తు చేస్తే బాగుంటుందని భావించారు. అందుకే ఏనాడూ ఆ దర్యాప్తులో జోక్యం చేసుకోలేదు.
కానీ.. ఆరోపణలు తగవు:
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వివేకానందరెడ్డి కుమార్తె అని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె కావాలంటే ఆ పార్టీలోకి వెళ్లొచ్చు. కానీ దాని కోసం ఇలా కుట్రలు చేయడం, ఆరోపణలు చేయడం సరికాదు.
జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కోలేనని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు, కచ్చితంగా ఇలాంటి మార్గాలే వెతుక్కుంటారు. ఇందులో మాకెలాంటి సందేహం లేదు. వివేకానందరెడ్డి హత్య వెనక జగన్‌గారు ఉన్నారని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సీఎంగారు సీబీఐ దర్యాప్తులో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఎవరినీ ప్రభావితం చేయలేదు.
అదే చంద్రబాబు గతంలో రాష్ట్రంలోకి సీబీఐని రానివ్వనని అన్నారు. ఇవాళ అదే సీబీఐని ఎత్తుకుని, జగన్‌గారి క్యారెక్టర్ అస్సాసిన్ చేయాలని చూస్తున్నారు.
ఆయన ఆత్మ క్షోభిస్తుంది:
ఒక మ్యానుఫ్యాక్చర్, మానిప్యులేటెడ్, సీఆర్పీసీ–161 స్టేట్‌మెంట్లు తీసుకువచ్చి జనం మీద వేస్తున్నారు. కాబట్టి విశ్వసించవద్దని ప్రజలను కోరుతున్నాం. నిజానికి వివేకానందరెడ్డిగారి ఆత్మ క్షోభిస్తుందని మేము బాధ పడుతున్నాం. ఆయనను ఏనాడూ జగన్‌గారు అడ్డుకోలేదు. అందుకే ఎమ్మెల్సీగా నిలబెట్టారు. ఆనాడు వైయస్సార్‌సీపీకి మెజారిటీ ఉన్నా, టీడీపీ కుట్ర చేసి ఓడించింది.
కానీ అవన్నీ మర్చిపోయిన సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి ఇవాళ మాట్లాడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజలెవ్వరూ విశ్వసించవద్దని మనవి.
మీడియా ప్రశ్నలకు జవాబునిస్తూ..
అందుకే భావిస్తున్నాం:
సీఆర్పీసీ–161 స్టేట్‌మెంటు చూసిన సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి ఖండించాలి. కానీ వారు ఆ పని చేయలేదు కాబట్టి, వారు ఆ విధంగా వాంగ్మూలం ఇచ్చారని మేము భావించాల్సి వస్తుంది. హత్య రోజు వరసగా చోటు చేసుకున్న «ఘటనలు చూస్తే.. హత్య తర్వాత జరిగిన విషయాలు చెప్పింది ఎవరు? సునీతమ్మనే కదా? ఎందుకంటే ఏ విషయమైనా వారి ద్వారానే తెలియాలి కదా? ఎందుకంటే జగన్‌గారు ఆమెకు అన్న. విపక్షనేత. ఇంటికి పెద్ద. కాబట్టి అన్ని విషయాలు చెప్పకుండా ఉంటారా?
దాన్ని ఎందుకు పక్కన పెట్టారు?:
2020 మార్చి వరకు సిట్ చేసిన దర్యాప్తును ఎందుకు పట్టించుకోవడం లేదు. వాటిని పూర్తిగా పక్కనపెట్టి సీబీఐ ఎందుకు ముందుకు పోతోంది. కేవలం ఒక ఉద్దేశంతోనే ఆ పని చేస్తోందని మేము భావించాల్సి వస్తోంది. అసలు కాల్ రికార్డులు బయటకు తీస్తే, అన్నీ బయటకు వస్తాయి కదా?
అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య:
సునీతమ్మ టీడీపీ వారికి దొరికింది. అందుకే ఆమెను ముందుపెట్టి కధ నడిపిస్తున్నారు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వ్యక్తిత్వ హరణ (క్యారెక్టర్ అస్సాసినేషన్). ఆ దిశలోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు.
సీబీఐ ఛార్జ్‌షీట్ కూడా అచ్చం అలాగే ఉంది అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
addComments
Post a Comment