కర్నూలు (ఓర్వకల్) ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు,అధికారులు.

 కర్నూలు (ఓర్వకల్) ఎయిర్ పోర్ట్ లో  ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు,అధికారులు.




కర్నూలు, ఏప్రిల్ 8 (ప్రజా అమరావతి): నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనేందుకు  గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి  బయలుదేరిన  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి  శుక్రవారం ఉదయం 10.50 గంటలకు కర్నూలు (ఓర్వకల్) ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.


 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్, పాణ్యం  ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ , కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ  మునిసిపల్ కమిషనర్ భార్గవ తేజ,  ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ , ఎయిర్పోర్ట్ ఇంఛార్జి మధుసూదన్ ఘనంగా స్వాగతం పలికారు.


అనంతరం ముఖ్యమంత్రి  11.05  గంటలకు కర్నూలు (ఓర్వకల్) ఎయిర్ పోర్ట్ నుండి నంద్యాల కు బయలుదేరి వెళ్లారు.




Comments