రాజమహేంద్రవరం (ధవళేశ్వరం) (ప్రజా అమరావతి):
అత్యంత వేడుకగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం
హాజరైన మంత్రి తానేటి వనిత, పలువురు ప్రజాప్రతినిధులు
ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం కేంద్రం గా తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ డా.కె. మాధవీలత ప్రారంభించారు.
సోమవారం ఉదయం తొలుత నూతన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో డిఎస్పీ ఎమ్.శ్రీలత జాతీయ జెండా ను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
నూతన కలెక్టరేట్ కార్యాలయంలో హిందు, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన వారు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత జిల్లా సంక్షేమాన్ని కోరుకుంటూ సర్వమత ప్రార్థన లో పాల్గొన్నారు.
తొలుత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్ కె. మాధవీలత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
కలెక్టర్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న డా.కె. మాధవీలత కి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ పలువురు ప్రజా ప్రతినిధులు నూతనంగా జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన డా. మాధవీలతను అభినందించారు.
తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ,
పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా 26 జిల్లా కేంద్రాలు ద్వారా పరిపాలన ప్రారంభించడం జరుగుతోందని పేర్కొన్నారు. మరింత సరళీకృత విధానంలో పౌర సేవలు అందించేందుకు జిల్లా లను పెంచడం జరిగిందన్నారు. సుస్థిరమయిన పరిపాలన అందించే దిశగా జిల్లాల ఏర్పాటు చేసామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన జిల్లాలలో పరిపాలన వ్యవస్థ వర్చువల్ ద్వారా ప్రారంభిస్తూ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నూతనంగా జిల్లా కలెక్టర్ గా నియమించిన డా. కే. మాధవీలత తో పాటు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎంపీ.. మార్గాని భరత్, రుడా చైర్మన్ మేడపాటి షర్మిల, ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఎమ్మెల్యే లు సత్తి సూర్యనారాయణ రెడ్డి, జక్కంపూడి రాజా, జి. బుచ్చయ్య చౌదరి, జి. శ్రీనివాసనాయుడు, చంద్ర నాగేశ్వరరావు, తలారి వెంకట్రావు, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణ రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ ఆకుల వీర్రాజు, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా , డివిజన్, మండల అధికారులు పాల్గొన్నారు.
అనంతరం తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యాలయం ఏర్పాటు చేసిన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన తో జిల్లా కలెక్టర్, తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అభినందన సభకి అధ్యక్షత వహించిన ఎంపీ మార్గాని భరత్ :
జిల్లా అభివృద్ధి కోసం పాటు పడుతూ, సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా చేరవేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్దేశంలో పనిచెయ్యడా నికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ పేర్కొన్నారు. రాజమండ్రి కి ప్రత్యేక చరిత్రాత్మక మైన ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. సర్ ఆర్థర్ కాటన్ మహాసయుడు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ జిల్లా లో ఉందన్నారు. వాలంటీర్ ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుగుణంగాసుస్థిరత కోసం పనిచెయ్యలని పిలుపు నిచ్చారు.
శాసన సభ్యులు తలారి వెంకట్రావు :
ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం 26 జిల్లాలు ఏర్పాటు చేసినట్లు శాసనసభ్యులు తలారి వెంకట్రావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కలెక్టర్ మాధవీలత సందేశం :
కొత్త రూపులు దిద్దుకుంటూ తూర్పుగోదావరి జిల్లా ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీ లత పేర్కొన్నారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక మైన ఘట్టానికి ఆవిష్కరణ జరిగిందన్నారు. ప్రతి రోజు ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించాలనే లక్ష్యం తో కలిసి ముందడుగు లు వేస్తూ పనిచేయాలన్నారు. రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల సమన్వయం తో పనిచేస్తూ, జిల్లా ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళదామని ఆమె పిలుపు నిచ్చారు. పౌర సేవలను పారదర్శకంగా అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యాల ను సాధించ గలుగుతామన్నారు. మన జిల్లా అభివృద్ధి కోసం మనం కలిసి అడుగులు వేద్దామని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, అందరిని కలుపుకుని వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించేందుకు రావడం, ఆ సందర్భంలో స్వంత తోబుట్టువులా ప్రజా ప్రతినిధులు ఎంతో ఆప్యాయత తో ఆహ్వానం పలకడం ఒక మధురానుభూతిని కలిగించిందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లలోని నియోజకవర్గ ల కలయిక, మన జిల్లా మధ్యలో గోదావరి నది ప్రవహించడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.
addComments
Post a Comment