వరి కోత యంత్రాల పరికరాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు

 అంతర్వేది 


ఏప్రియల్ 24, (ప్రజా అమరావతి);

 

రెండవ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చే ల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆదివారం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతముగా దర్శించుకున్నారు.


 అంతర్వేదిలో బీసీ సంక్షేమం ,సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యుల కు రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద రావు, దేవస్థానం ఈవో సాదర ఆహ్వానం పలికారు .


కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అక్కడ ఉన్న అన్నదాన కేంద్రానికి వెళ్లి అన్నదానం కార్యక్రమాన్ని పరిశీలించారు.


 భక్తులతో ముచ్చటించి సాధారణ భక్తులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.


 ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ చే పంపిణీ చేయబడిన సుమారు 27 లక్షల రూపాయల విలువగల వరి కోత యంత్రాల పరికరాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు


.


శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాని ప్రభుత్వ పరంగా అభివృద్ధి పరచే విధంగా కృషి జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా మీడియా కు తెలిపారు.



Comments