ఏలూరు జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్.,

 జిల్లా పోలీసు కార్యాలయము, ఏలూరు జిల్లా,*ఏలూరు.(ప్రజా అమరావతి);

                                                  

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్.,*ఈ రోజు అనగా 03.04.2022 తేదీన ఉదయం కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ గా నియమితులైన శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్., వారు పదవీ బాధ్యతలను స్వీకరించారు.  కొత్తగా ఏర్పడిన జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో పశ్చిమ గోదావరి జిల్లా కు ఏలూరు  జిల్లా ఎస్పీగా నియమితులై ఈరోజు ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలను  చేపట్టారు.


_ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాసం రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు గారికి, రాష్ట్ర గౌరవ డిజిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ  కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని. మహిళల మరియు చిన్నారులు భద్రత అనేది మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలపై దృష్తి సారించి వాటిని అరికట్టేలా చూస్తామని, జిల్లా లో నాటు సారాయి తయారీ మరియు విక్రయాల చేసే వారి కీ పరివర్తన ప్రవర్తన జాగృతి బాసట మరియు జాగృతి కార్యక్రమాలను నిర్వహించి వారిలో పరివర్తనం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలియపరుచినారు. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నిర్వహించే  స్పందన కార్యక్రమం ద్వారా సత్వరమే విచారణ చేసి న్యాయం చేస్తామని, నూతనంగా కలసిన ప్రతి మండలంలో గత 05 సంవత్సరాలలో జరిగిన క్రైమ్ ప్యాటర్న్ పై ఒక ప్రణాళిక సిద్దం చేసి అక్కడ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం అని తెలియపరుచినారు. ఆస్తి నేరాలు, శారిరిక నేరాలపై (Bodily Offences), మరియు సారాయి నిర్మూలన పై, గంజాయి రవాణా పై   ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియపరుచినారు. జిల్లలో కలసిన నేషనల్ హైవే పై జరిగే నేరాలు, ప్రమాదాల నివారణకు ప్రత్యేక పోలీసు పెట్రోల్లింగ్ ఏర్పాటు చేస్తామని తెలియపరుచినారు._

ఈ సందర్బంగా ఏలూరు జిల్లా ఎస్పీగా పదవీ బాధ్యతలను స్వీకరించిన  శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఏ.వి సుబ్బా రాజు గారు, అదనపు ఎస్పీ ఏలూరు ఇంఛార్జి డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ గారు, ఏ.అర్ అదనపు ఎస్పీ శ్రీ బి.రామ కృష్ణ గారు,  ఎస్.బి సిఐ వి.రవి కుమార్ గారు, డి.సి.అర్.బి ఇన్స్పెక్టర్ ప్రసాద్ కుమార్,డిఎస్పీ లు పైడేశ్వర రావు, సుభాకర్ ఎ.ఆర్ డిఎస్పీ శ్రీ కృష్ణంరాజు గారు,ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గోపి గారు, ఏ.ఏ. ఓ. రామ్ కుమార్ గారు, ఆర్.ఐ కృష్ణంరాజు గారు,  మినిస్టేరియల్ సిబ్బంది ఎస్పీ గారికి పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతించినారు.