మంత్రివర్యులను డా. వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. టి. జానకిరామ్ , మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు

 అమరావతి (ప్రజా అమరావతి);

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖమాత్యులు గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు  ఈ రోజు ఉదయం సచివాలయంలో భాద్యతలు స్వీకరిస్తున్న శుభతరుణంలో, గౌరవ మంత్రివర్యులను  డా. వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. టి. జానకిరామ్ గారు, మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు


. వీరి వెంట విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డా. బి. శ్రీనివాసులు గారు ఉన్నారు. 

ఈ సందర్భంగా ఉపకులపతి టి. జానకిరామ్ గారు, ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు గురించి, పరిశోధన ప్రాజెక్ట్స్ గురించి, ఉద్యాన శాస్త్ర విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు మరియు ఉద్యోగ అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ది శిక్షణలు, రైతు భరోసా కేంద్రాల బలోపేతం గురించి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి, గౌరవ మంత్రివర్యులకు వివరించారు . 

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వీ.ఎస్. నాగిరెడ్డి గారు మరియు  ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా ఏ. విష్ణువర్ధన్ రెడ్డి గారు, డా. వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. టి. జానకిరామ్ గారు కలసి, గౌరవ మంత్రివర్యులతో ఫోటో తీసుకొన్నారు .

డా. వై .ఎస్ .ఆర్ . ఉద్యాన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలో పని చేస్తుంది .

Comments