యానాదుల చిరకాల కోరిక సోంత ఇంటి కల

 

నెల్లూరు, ఏప్రిల్ 19 (ప్రజా అమరావతి);


కనీస అవసరాలను సైతం అడిగేందుకు నోరు లేని నిరుపేదలైన యానాదుల చిరకాల కోరిక సోంత ఇంటి కల


రాబోవు దసరా పండుగ నాటికి నిజం చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి తెలిపారు.


రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం సొంత నియోజకవర్గ ప్రజలను కలిసే కార్యక్రమంలో భాగంగా టి పి గూడూరు మండలం నరుకూరు S T కాలనీ లో మంగళవారం సాయంత్రం పర్యటించారు. దాదాపు 80 కుటుంబాలు అనాదిగా పంట కాలువ పోరంబోకు లో నివసిస్తున్నారు. వారి సమస్యలను మంత్రి ముందు ఏకరువు పేట్టారు. ఇంటి నిర్మాణం లో జాప్యానికి గల కారణాలను జాయింట్ కలేక్టరు ను విచారించారు. అతి తోందరలోనే స్థలం ను ఎంపిక చేసి ఇంటి నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో జాయింట్ కలేక్టరు శ్రీ హారేంధిర ప్రసాద్, నెల్లూరు ఆర్ డి ఓ కోండయ్య, ఇరిగేషన్ ఎస్ఇ శ్రీ కృష్ణ మోహన్ తదితరులు పాల్గోన్నారు.
Comments