రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
విద్యుత్ వినియోగానికంటే సరఫరా తక్కువ గా ఉండడం వలన ఇటీవల ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ అంతరాయములు ఏర్పడినవి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు గృహ విద్యుత్ వినియోగదారులకు మరియు అగ్రికల్చరల్ వినియోగదారులకు ఎట్టి పరిస్థితులలో విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు గాను పరిశ్రమలకు మరియు వాణిజ్య సముదాయములకు మరియు ఆక్వా రంగానికి విద్యుత్ వినియోగంపై పరిమితులు విధించి గృహ వినియోగానికి నిరంతరం మరియు వ్యవసాయానికి కంటిన్యూస్ 3-ఫేజ్ సప్లై 2 గ్రూపులలో సరఫరా చేయడం జరుగుతుంది.
ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగదారులకు మరియు వ్యవసాయానికి ఎటువంటి విద్యుత్ కోతలు లేవు.
ఈ క్రింది విధముగా 08.04.2022 నుండి 22.04.2022 వరకు పరిశ్రమలకు మరియు వ్యాపార సంబంధిత విద్యుత్ సర్వీసులకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను నియంత్రిచడం జరుగుతుంది.
పరిశ్రమలు:
కంటిన్యూస్ ప్రాసెస్ పరిశ్రమలు వాటి విద్యుత్ డిమాండ్ లో 50% మాత్రమే వాడవలెను ( 24x 7)
ఇతర పరిశ్రమలు ప్రస్తుతం ఉన్న వారాంతపు సెలవునకు అదనంగా మరొక రోజును అనగా మంగళవారం సెలవుగా ప్రకటించవలసి ఉంటుంది. అంతే గాక పగలు 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు కేవలం ఒక షిఫ్టును మాత్రమే కొనసాగించవలసి ఉంటుంది.
వ్యాపార సంబంధిత సర్వీసులు:
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మరియు అన్ని షాపింగ్ మాల్స్ కేవలం 50% ఏ.సి లు మాత్రమే వాడవలసి ఉంటుంది.
ప్రతీ 220/132కె వి సబ్ స్టేషన్ లలో విద్యుత్ సరఫరా పర్యవేక్షించుటకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా పర్యవేక్షణ చేయుచున్నారు. విద్యుత్ సరఫరా యొక్క సమాచారం కొరకు సంబంధిత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ / ఆపరేషన్ వారిని సంప్రదించవలెను. డివిజన్ స్థాయి అధికారులు ఫోన్ నంబర్స్.
రాజమహేంద్రవరం సర్కిల్ ఆఫీస్ - 7382299960
రాజమహేంద్రవరం డివిజన్ - 9440812585
కాకినాడ డివిజన్ - 9440812586
జగ్గంపేట డివిజన్ - 9440812589
అమలాపురం డివిజన్ - 9440812588
రామచంద్రపురం డివిజన్ - 9440812587
రంపచోడవరం డివిజన్ - 7382585554
నిడదవోలు డివిజన్ - 9440812706
అత్యవసర మెయింటెనెన్స్ చేయడానికి, బ్రేక్ డౌన్స్, ఫుజ్ ఆఫ్ కాల్స్ చేయడానికి సిబ్బందిని 24x 7 గంటలు
ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా మానిటర్ చేయడం జరుగుతుంది.
కావున విద్యుత్ వినియోగదారులందరూ సహకరించవలసినదిగా పర్యవేక్షక ఇంజనీర్, ఆపరేషన్ సర్కిల్,ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ రాజమహేంద్రవరం .. టి.వి.ఎస్.ఎన్.మూర్తి వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
addComments
Post a Comment