రుయా ఆర్ ఎం ఓ సస్పెన్షన్.
రుయా సూపరింటెండ్ కు షోకాజ్ నోటీస్
రేపటినుండి రోస్టర్ , రేట్లు ప్రదర్శన .. జిల్లా కలెక్టర్
తిరుపతి ఏప్రిల్ 26 (ప్రజా అమరావతి): రుయా సంఘటన బాధాకరం , అమానవీయం , టూవీలర్ లో బాడీని తీసుకెళ్ళండంతో సి ఎం ఓ ఆదేశలతో కమిటీ నిర్ధారించిన మేరకు ఆంబులెన్స్ ఏర్పాటులో అలసత్వం వహించినందుకు రుయా ఆర్ ఎం ఓ ను సస్పెన్షన్ , సూపరింటెండెంట్ కు షోకాజ్ జారీచేశామని జిల్లాకలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన సంఘటపై మంగళవారం మధ్యాహ్నం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఆంబులెన్స్ డ్రైవర్లు నిర్లక్ష్యంతో వ్యవహరించిన నలుగురిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది , రేపటినుండి ప్రభుత్వ ఆంబులెన్స్ లు అందుబాటులో లేని పక్షంలో రేట్లు , ఏ వాహనం వెళ్ళాలి అనే రోస్టర్ విధానం అమలు చేస్తున్నామని అన్నారు. నేటి రాత్రిలోపు ఆర్డీఓ , ఆర్టీఓ , పోలీస్ , డి ఎం హెచ్ ఓ సమావేశం జరిపి రేట్లు నిర్ణయించి ఆసుపత్రిలో ప్రదర్శిస్తారని మరోసారి ఇలాంటి కొంతమంది ఆంబులెన్స్ దందా సంఘటనలకు తావులేకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
addComments
Post a Comment