రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
జిల్లాలో ఈవారంలో 2500 ఓ టి ఎస్ లక్ష్యాలను సాధించాం
ప్రతి కమ్యూనిటీ కో ఆర్డినేటర్ కి 5 చొప్పున లక్ష్యాలు నిర్దేశించాం
చీఫ్ సెక్రటరీ జూమ్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వెల్లడి
స్పందన ఫిర్యాదుల పరిష్కారం కోసం, ఈ శ్రమ్ నమోదు , ఉపాధి హామీ పనిదినాలు పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హౌసింగ్, గ్రామ వార్డు సచివాలయ లు, భవన నిర్మాణాలు, స్పందన , స్వచ్ఛ సంకల్ప, తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, వివిధ శాఖల ద్వారా మండల, గ్రామ స్థాయిలో చేపట్టే అభివృద్ధి పనుల లక్ష్యాలను సాధించడానికి వారం వారానికి లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రగతి సాధించాలన్నారు.
ఓ టి ఎస్ లక్ష్యాలను సాధించడానికి కమ్యూనిటీ కో ఆర్డినేటర్ లకు 5 చొప్పున లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని, వొచ్చే వారానికి మరింత ప్రగతి సాధించడం జరుగుతుందన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష చేస్తూ, ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై అధికారులు క్షేత్ర స్థాయి లో రోజువారీ సమీక్షలు చేయాలన్నారు. హౌసింగ్ లక్ష్యాలను సాధించడానికి రోజువారీగా సమీక్ష చేపట్టాలని, ఎప్పటి కప్పుడు వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం లో పని దినాలు పెంపు కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలులో ఇండ్ల నిర్మాణ పనులు కూడా అనుసంధానం చెయ్యడం కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి అంశంపై సమీక్ష చేస్తూ, పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. స్పందన ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న మార్గ దర్శకాలు . అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఓటీఎస్, ఇండ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. భవన నిర్మాణ లపై సమీక్ష చేస్తూ సచివాలయ, అర్భికే, హెల్త్ క్లినిక్ భవనాలు, గ్రామ, వార్డు సచివాలయ లను క్షేత్ర స్థాయి సందర్శన సందర్భంలో అధికారులు తప్పనిసరిగా తనిఖీలు చెయ్యలన్నారు. జిల్లాలో 512 సచివాలయలలో మిగిలిన 65 భవనాలు పనులు పూర్తి చేయడం పై మండల పరిధిలోని అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు లక్ష్యాలను ఇవ్వాలన్నారు. జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్ప లక్ష్యాలతో భాగంగా 300 గ్రామ పంచాయతీ లలో లక్ష్యాలను సాధించడానికి దశల వారీగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. 5 వేలు పైబడిన పంచాయతీలు 103 ఉండగా ఇప్పటికే 41 గ్రామాల్లో పనులు పూర్తి చేశామని, వొచ్చే వారానికి 18 గ్రామాల లక్ష్యాలను నిర్దేశించుకున్న ట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని బొమ్మురు, బొబ్బర్లంక లలో ఉన్న డంపింగ్ యార్డ్ లను జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం మోడల్ ఎంపిక చెయ్యడం జరిగిందన్నారు. జిల్లాలో సంపద సృష్టి కి అవకాశం ఉన్న 123 పంచాయతీ ల్లో అవకాశం ఉందని తెలియచేశారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి అనుగుణంగా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సి ఎస్. వీసి లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, సీపీఓ పి. రాము, డి పి ఓ జే. సత్యనారాయణ , డ్వామా ఇంఛార్జి పిడి పి. జగదాంబ , డిహెచ్ఓ బి. తారాసింగ్ లు పాల్గొన్నారు.
addComments
Post a Comment