26.5.2022న జాతీయ లోక్ ఆధాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);తూర్పు గోదావరి, కాకినాడ,  కోనసీమ, అల్లూరి సీతారామరాజు  జిల్లాలోని 15  కోర్టు లలో  ది.26.06.2022 న (ఆదివారం) జాతీయ లోక్ అదాలత్ (వర్చ్యుయల్ మరియు హైబ్రిడ్) విధానములో  నిర్వహించడం జరుగు తుందని తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె.ప్రత్యూష కుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ  పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఈ దిగువ తెలిపిన కోర్టు ల యందు ది. 26.5.2022న జాతీయ లోక్ ఆధాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.


1. రాజమహేంద్రవరం 2. అమలాపురం 3. కాకినాడ 4. పెద్దాపురం 5. పిఠాపురం  6. రామచంద్రపురం 7. రాజోలు 8. ఆలమూరు 9. తుని , 10. ముమ్మిడివరం 11. కొత్తపేట 12. ప్రత్తిపాడు 13. అనపర్తి 14. రంపచోడవరం 15. అడ్డతీగల


ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడును. 


కావున కక్షిదారులందరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని కోనసీమ  జిల్లా వ్యాప్తంగా జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు  ది. 26.06.2022 న (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను వర్చ్యుయల్ మరియు హైబ్రిడ్ విధానములో పరిష్కరించు కొనవలసినదిగా తెలియజేయడమైనది.