రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
సాంస్కృతిక, చరిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం
పర్యాటక కేంద్రంగా జిల్లా లోని మరిన్ని ప్రాంతాలను గుర్తించాలి
మంజీరా 4 స్టార్ హోటల్ లో మల్టీ ఫ్లెక్స్ ధియేటర్, షాపింగ్ కాంప్లెక్స్ గా అభివృద్ధి ...
కడియపులంక - ధవళేశ్వరం కెనాల్ మార్గం బోటింగ్ టూరిజం సూచనలు..
కలెక్టర్ డా. మాధవీలత
తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డా. కె.మాధవిలత సూచించారు.
బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టూరిజం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరం లో పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రకృతి అందాలు, గోదావరి నది తీరం వంటివి ఎన్నో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రదేశాలు ఉన్నాయన్నారు. వాటికి ప్రాచుర్యం కలిగించి జిల్లాలో టూరిజంను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
కందుకూరి వీరేశలింగం పంతులు, బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్ వంతెన, ధవళేశ్వరం బ్యారేజ్, కాటన్ దొర గృహం, ఎన్నో పుణ్య క్షేత్రాలు, గోదావరి పాయలు, ప్రకృతి అందాలు వంటివి ఎన్నో ఉన్నాయన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు పరిధిలో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలు గుర్తించేందుకు మండలస్థాయి అధికారులతో వివరాలు సేకరించి, వాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలోని మంజీరా 4 స్టార్ హోటల్ లో మల్టీ ఫ్లెక్స్ ధియేటర్, షాపింగ్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గోదావరి, తీర ప్రాంత అందాలు కమనీయం దృశ్యం గా పర్యాటకులను ఆకర్షించేందుకు
కడియపు లంక - ధవళేశ్వరం గోదావరి కెనాల్ మార్గం లో బోటింగ్ టూరిజం ని అభివృద్ధి చేయాలని సూచించారు. సీతానగరం ప్రాంతంలో ఉన్న పురుషోత్తమ పట్నం గ్రామంలో ఉన్న 100 ఎకరాలు చెరువును బొట్టింగ్ టూరిజం, రిసార్ట్ గా అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
టూరిజం ప్రాంతీయ సంచాలకులు టిఈఎం రాజా వివరిస్తూ నగరపాలక సంస్థ పరిధిలో గోదావరి రివర్ బండ్ ఇప్పటికే అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో హేవ్ లాక్ బ్రిడ్జి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం టు పాపికొండలు గోదావరి నది లాంచి ప్రయాణం, పట్టిసం ఆలయానికి కి టూరిజం అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న చర్యలను వివరించారు.
సమావేశం లో టూరిజం .. రీజినల్ డైరెక్టరు టిఈఏమ్ రాజు,డిటీఓ పి. వెంకటాచలం, డివిజినల్ మేనేజర్ టిఎస్ వీర నారాయణ, ఈఈ రాజారామ్, డీఈ సత్యనారాయణ, బోటింగ్ నిర్వాహకులు మేనేజర్ గంగబాబు తదితరులున్నారు.
addComments
Post a Comment