రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
సమన్వయంతో ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడం
ద్వారా నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్ద కలుద్దామని నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు.
శనివారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో క్లీన్ గ్రీన్ సిటీగా రాజమహేంద్రవరం పై ఆదికవి నన్నయ్యయూనివర్సిటీ , ఎన్జీవో సంస్థలైన స్వర్ణాంధ్ర , స్వతంత్ర, రోటరీ క్లబ్ , రివర్సిటీ, వాకర్ అసోసియేషన్, జైన్, జే సి ఐ, ఓనర్ అసోసియేషన్, తదితర స్వచ్ఛంద సంస్థలకు చెందిన 47 మందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం చారిత్రాత్మకమైన ప్రదేశ మన్నారు. ప్రతినిత్యం ఎందరో వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ఎవరికి వారు వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందులో భాగంగా మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు, క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. నగరంలో కుక్కల బెడద, ఆవుల , తదితర సమస్యలను తెలియచెయ్యడం జరుగుతోందన్నారు. ఎవరికి వారు ఇష్టానుసారం మిగిలిన ఆహార పదార్థాలు వ్యర్ధాలు బహిరంగంగా వేయడం ద్వారా ఇటువంటి పరిస్థితిలో ఏర్పడతాయి అధ్యయనాల్లో వెల్లడైందన్నారు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ గా మన నగరాన్ని తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా భాగస్వామ్యం అవుదాం అన్నారు. ఎవరైనా నా ఏ సంస్థ అయినా స్వచ్ఛంద, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటే నగరపాలక సంస్థ తరఫున ఒక నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. వ్యక్తిగతంగా ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకొని కార్యక్రమాలు నిర్వహిస్తే సత్ఫలితాలను మెరుగైన ఫలితాలను సాధించడం సాధ్యమవుతుందన్నారు స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరానికి అన్ని అవకాశాలు ఉన్నాయని ఎందుకు ఓకే తాటిపైకి వచ్చి కలిసి అడుగులు వేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మీ ఆలోచనలు సూచనలకు మా సహకారం కూడా అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. విజయవాడ తరహాలో నగరాన్ని కూడా దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దడంలో అన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గోదావరి నది ప్రక్షాళనకు ప్రజల నుండి ఇ స్వచ్ఛంద సంస్థల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. గోదావరి నదీ తీరంలో , నగరంలో ఎందరో చారిత్రాత్మకమైన సంఘసంస్కర్తలు విగ్రహాలు ఉన్నాయని వాటి నిర్వహణ కోసం సామాజిక బాధ్యతగా వ్యాపార సంస్థలను భాగస్వామ్యం ఆలోచన చేస్తున్నామన్నారు. సమాజ హితం కోసం నగరంలో చేపట్టే ఏ కార్యక్రమానికైనా కార్పొరేషన్ సహకారం ఉంటుందని తెలిపారు. నగర పరిశుభ్రత విషయంలో ఎవరికి వారు వ్యక్తిగత నియంత్రణ ఉండాలన్నారు ఇంటింటికి చెత్త సేకరణకు వచ్చే వ్యక్తులకు మాత్రమే తడి చెత్త పొడి చెత్త ఇవ్వాలని, అంతేగాని రాత్రి సమయంలో ఇష్టానుసారం బహిరంగ ప్రదేశాల్లో బయట ప్రదేశాల్లో పడవెయ్యవద్దని కోరారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రతి ఆలోచనను తెలుసుకొని వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు, ఎమ్ హెచ్ ఓ వినూత్న,సిటీ ప్లానర్ సూరజ్ కుమార్,ఎస్.ఈ పాండు రంగారావు ఎన్జిఓ సంస్థలప్రతినిధులు , తదితరులు కమిషనర్ వెంట పాల్గొన్నారు
addComments
Post a Comment