పేద విద్యార్థుల పట్ల నిజమైన చిత్త శుద్ధి ఉన్న జగనన్న ప్రభుత్వం: మంత్రి రోజా
తిరుపతి, మే 03 (ప్రజా అమరావతి): పేద విద్యార్థుల పట్ల నిజమైన చిత్త శుద్ధి ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్ వి యు స్టేడియం వద్ద నిర్వహించనున్న జగనన్న విద్యదీవేన బహిరంగ సభ ఏర్పాట్లను పర్యాటక శాఖ మంత్రి, తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ శిరీష, జిల్లా కలెక్టర్ కే. వెంకట రమణారెడ్డి, మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్ అనుపమ అంజలి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి , తిరుపతి ఆర్దిఒ కనక నరసారెడ్డి లతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ కొత్త జిల్లాల విభజన అయిన తర్వాత మొట్ట మొదటి సారిగా 5 వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి జిల్లాకు వస్తుండడం ఎంతో హర్షించదగ్గ విషయం అని, అదికూడా తనకు ఇష్టమైన విద్యా దీవెన కార్యక్రమంకి రావడం ఎంతో హ్యాపీగ ఉందని తెలిపారు. తల్లుల ఖాతాల్లోకి పారదర్శకంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జగనన్న విద్యాదీవెన డబ్బు నేరుగా తల్లుల ఖాతాలో జమచేయడం మనం చూస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఫీజ్ రీయంబర్స్ బకాయిలను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థులు డాక్టర్లు ,ఇంజనీర్లు కావాలన్నా ఏమి చదవాలన్న వారి చదువులకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని వారి చదువుకి ఆటంకం లేకుండా నడిపించడం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అని తెలిపారు. అందరు కలిసి కట్టుగా కృషి చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి పర్యటనలో ముఖ్యమంత్రి పర్యటనకు విధులు కేటాయించిన అధికారులు వున్నారు.
addComments
Post a Comment