ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు.

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


ఈరోజు స్పందనకు వివిధ మార్గాల ద్వారా 44 అర్జీలు


పిర్యాదు పరిష్కారం చేసిన తర్వాత సెల్ఫి ఫోటో అప్లోడ్ చెయ్యండి


- కె. దినేష్ కుమార్



ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని  నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు.



సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.


ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, డయల్ యువర్ కమిషనర్ ద్వారా 10, ఇ- స్పందనలో 10, స్పందనలో 24 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదుకి సంబంధించిన సమస్య  పరిష్కా రం కోసం ప్రత్యేక దృష్టి చూపాలన్నారు. సంబంధించిన విభాగాల  అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని , తగిన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్క సమస్య ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పరిష్కారం చూపేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని సందర్భంలో వాటిని స్పష్టంగా తెలియచేసే భాధ్యత మీదే అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, సరైన తీరు చూపకపోతే సహించబోమని హెచ్చరించారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాల వారీగా గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక సంబందించిన సమస్య పరిష్కారం స్థాయి వివరాలు తెలియచెయ్యాలని, ఒక వేళ టెండర్ ప్రక్రియలో ఉంటే ఆ సమాచారం కూడా తెలియచేయ్యా లన్నారు. స్పందన సమస్య పరిష్కారం అయిన తరువాత అర్జీ దారునితో ఫోటో తీసుకుని అప్లోడ్ చెయ్యాలని దినేష్ కుమార్ ఆదేశించారు.


స్పందన కార్యక్రమం సంబంధించిన నగర పాలక సంస్థ అధికారులు,అదనపు మునిసిపల్ కమీషనర్ పి. వి. సత్యవేణి, ఇంజనీరింగ్ ఇతర అధికారులు పాండురంగారావు, సూరజ్ కుమార్, సాంబశివరావు, డా.వినూత్న, , వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments