విజయవంతమైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు ఢిల్లీ పర్యటన

  ఏ.పీ.ఐ.సీ – ఏ.పీ భవన్ -  న్యూఢిల్లీ – మే  10 (ప్రజా అమరావతి),    

విజయవంతమైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు ఢిల్లీ పర్యటన 


       రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు ఢిల్లీ పర్యటనలో రెండవ రోజు భాగంగా  ఈ రోజు కేంద్ర పౌరసరఫరాల శాఖ సెక్రెటరీ లు రోహిత్ కుమార్ సింగ్, సుధాంశు పాండే (ఆహారం మరియు పౌర సరఫరాలు), సుబోధ్ కుమార్ సింగ్ జాయింట్ సెక్రెటరీ ఎఫ్. సి. ఐ  &  సి. ఎం. డి,  జగన్నాథన్ జాయింట్ సెక్రెటరీ,             జి. శ్రీనివాస్ అడిషనల్ సెక్రెటరీ, ఫైనాన్స్ సలహాదారుడు లను  కృషి భవన్ న్యూ ఢిల్లీ లోని వారి వారి కార్యాలయాలలో  కలిసి రాష్ట్రానికి రావలసిన పెండింగ్ నిధులను వీరిని కోరగా సానుకూలంగా స్పందించి విడుదల చేస్తామన్నారు.   నిన్న విగ్యాన్ భవన్లో జరిగిన సమావేశం నిమిత్తమై పియూష్ గోయల్ గారిని రావలసిన బకాయిలను విన్నవించగా వెంటనే స్పందించి తమ కార్యదర్శులకు విషయాన్ని విన్నవించగా వారు తక్షణమే స్పందించి 2017-22 దాకా పెండింగ్ బిల్స్ కు తగు సహకారం, అదనపు నిధులు ఇస్తామన్నారు.  ఇందులో భాగంగా నీతి  ఆయోగ్  అధికారులను కూడా కలవడం జరిగింది. ఈ మొత్తం రిపోర్ట్లను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు పంపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.     ఈ సందర్భంగా మంత్రి ఆంధ్రప్రదేశ్ భవన్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. 

  మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రానికి రావలసిన 7 - 8 వేల కోట్ల పెండింగ్ బిల్స్, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య నిధుల విభజన గూర్చి అధికారులతో చర్చించామన్నారు.   అధికారులు వీటన్నిటికీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతమైనందుకు సంతోషించారు.       



Comments