తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో బసవ జయంతి

 

రాజమహేంద్రవరం . (ప్రజా అమరావతి);



తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో బసవ జయంతి 




నేడు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతిని కలెక్టరేట్లో అధికారంగా నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు పేర్కొన్నారు. 


మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో పరిపాలనాధికారి శ్రీనివాస్, సిబ్బంది తో కలిసి బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్వో సుబ్బారావు మాట్లాడుతూ సుమారు గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే సమాజంలో కుల,వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని  చాటి చెప్పిన "బాగేవాడి బసవేశ్వరుడి"  జయంతి ని ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర ప్రభుత్వం  అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు. బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో ఒకరన్నారు. అందుచేతనే  ఆయనని విశ్వ వ్యాప్తం గా బసవన్న, బసవుడు, విశ్వగురు అని పిలుస్తారని పేర్కొన్నారు.  సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది తదుపరి రోజుల్లో  లింగాయత ధర్మం స్థాపించారన్నారు.  బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడిందన్నారు. భవిష్యత్తు తరాలకు భారతీయ హైందవ సంస్కృతి మూలాలు వ్యాప్తికి ఇటువంటి వేడుకలు మూలాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదన్నారు.



ఈ కార్యక్రమంలో కలెక్టరెట్, ఇతర శాఖల  సిబ్బంది పాల్గొన్నారు. 


Comments