ఖరీప్‌ రాక మునుపే సాయం...

 

అమరావతి (ప్రజా అమరావతి);


*వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా..* *వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌.*



*నాలుగో ఏడాది మొదటి విడతగా ఇచ్చే రూ.7,500లకు గానూ రూ.5,500లను ఏలూరు జిల్లా గణపవరంలో బటన్‌ నొక్కి  రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ నెల 31న రైతుల ఖాతాల్లో జమ కానున్న పీఎం కిసాన్‌ నిధులు మరో 2వేలు.*

*దీంతో మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ కానున్నాయి*.



*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే... :*


దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో గణపవరంలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, అన్నకూ, అవ్వకూ, తాతకు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు.


*ఖరీప్‌ రాక మునుపే సాయం...


*

జూన్‌ మాసం రాక మునుపే, ఖరఫ్‌ మొదలు కాకముందే, వ్యవసాయపనులు మొదలు కాకముందే... 2022 ఖరీఫ్‌ పంటకు పెట్టుబడిగా వైయస్సార్‌ రైతుభరోసా సాయం అందిస్తున్నాం. 


*రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుదని...* 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా,వాచా, కర్మేణా గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఈ మాడు సంవత్సరాల కాలంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ప్రతి అడుగు  ఆ దిశగానే వేశాం. 

రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టాం. క్రమం తప్పకుండా క్యాలెండర్‌ ఇచ్చి, క్యాలెండర్‌లో ఇచ్చిన నెలలోనే వైయస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.


*మూడు విడతల్లో భరోసా....*

వైయస్సార్‌ రైతు భరోసాగా ప్రతి సంవత్సరం రూ.13,500 మూడు విడతల్లో ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్‌(అటవీభూములు) సాగు చేస్తున్న రైతులందరికీ  ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. వరుసగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో ఏడాది మళ్లీ వైయస్సార్‌ రైతు భరోసా సొమ్ము గణపవరం వేదికగా విడుదల చేస్తున్నాం. నాలుగో ఏడాదికి మొదట విడత కింద ఖరీప్‌ సీజన్‌ మొదలుకాక ముందు మే నెలాఖరులోపు రూ.7,500, తర్వాత పంట కోతకు వచ్చినప్పుడు అక్టోబరు మాసంలో మరో రూ.4వేలు, ఆ తర్వాత సంక్రాంతికి పంట ఇచ్చికొచ్చే సమయానికి రూ.2వేలు చొప్పున రూ.13,500 రైతు భరోసా కింద ఇస్తున్నాం.


*మొత్తం 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో...*

అందులో భాగంగా ఈ నాలుగో ఏడాది మొదటి విడతసొమ్ము కింద రూ.7,500లో రూ.5,500ను ఇవాళ ఇక్కడ నుంచి బటన్‌ నొక్కి మీ ఖాతాల్లో జమ చేస్తున్నాను. మరో రూ.2వేలు పీఎం కిసాన్‌ కింద ఈ నెలాఖరుకి కేంద్రం విడుదల చేస్తుంది. అది కూడా ఈ నెల 31 తేదీన రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. మొత్తంగా ఈనెలాఖరు కల్లా 50 లక్షల మంది పై చిలుకు రైతులకు వారి ఖాతాల్లో ఒక్కోక్కరికి రూ. 7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు ఈ నెలాఖరులోపు జమ అవుతుంది.


*ఇప్పటివరకు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.23,875 కోట్లు..*

ఇలా ప్రతియేటా దాదాపు 50 లక్షల మంది రైతన్నలకు సుమారు రూ.7వేల కోట్లు రైతుభరోసా అన్న ఒక్క పథకం ద్వారానే అందిస్తున్నాం. ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా ఈ పధకం కింద అందిస్తున్నాం. ఇప్పుడు నాలుగో ఏడాది మొదటి విడత కింద ఈరోజు ఇస్తున్న రూ.3,758 కోట్లు కూడా కలుపుకుంటే.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కాకమునుపే కేవలం వైయస్సార్‌ రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలో రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా జమ చేశాను.


*మూడేళ్లలో రైతులకు రూ.1 లక్ష కోట్లకు పైగా సాయం...*

చరిత్రలో కూడా ఎన్నడూ లేనివిధంగా వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్లలో మన ప్రభుత్వం... రైతులకు రూ.1,10,093 కోట్లు ఇచ్చాం.


*రైతుల దృష్టికి కొన్ని విషయాలు...* 

 2022కు సంబంధించి వైయస్సార్‌ రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్న ఈసమయంలో రాష్ట్రంలో ప్రతి రైతుకూ కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను. 

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనల వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎక్కడా కరవులేదు. ఈ మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలముగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. ఈ మూడేళల్లో ప్రతి రిజర్వాయర్‌ కూడా సకాలంలో నిండుతూ వచ్చింది. రాష్ట్రంలో ఈ మూడేళ్లలో అనంతరపురము లాంటి కరువు జిల్లాలతో సహా అన్ని చోట్ల భూగర్భ జలాలు రికార్డు స్ధాయిలో పెరిగాయి. అంతకముందు ఐదేళ్ల చంద్రబాబునాయుడు పాలన చూశాం. ఇప్పుడు మూడేళ్లగా మన పాలన చూస్తున్నారు.



*పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి...*

 ఈ మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గమనించినట్లైతే.. సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. 

చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కాలంలో.... ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నుల అయితే.. మన ప్రభుత్వంలో ఈ మూడేళ్ల కాలంలో సగటున 170 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది. గత ప్రభుత్వంలో వడ్డీలేని రుణాలకు ఐదు సంవత్సరాలలో బాబు గారి హయంలో చెల్లించింది కేవలం రూ.782 కోట్లు. అదే ఈ మూడేళ్ల కాలంలో ఈ పథకానికి మన ప్రభుత్వం రూ.1282 కోట్లు ఇచ్చింది. తేడా గమనించమని కోరుతున్నాను. అప్పుడూ రైతులే అప్పులు తీసుకున్నారు. అలాంటి రైతుల పట్ల వారికున్న ప్రేమ ఎంత, మీ జగన్‌కు ఉన్న ప్రేమ ఎంత అన్న తేడా గమనించండి. 


*ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలనూ ఆదుకున్నాం...*

రైతులుకు మంచి చేయాలని మనసుతో ఆలోచన చేస్తున్నాం. అయినా కూడా దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న కొంతమంది రైతుల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను వదిలేయలేదు. గతంలో మాదిరిగా రైతు వ్యవసాయం చేస్తున్న మనిషి కాదనే కుంటిసాకులు చెప్పలేదు. పట్టాదారు పుస్తకం ఉంటే చాలు వాళ్లందరికీ కూడా రూ.7 లక్షలు ఇస్తున్నాం. కౌలు రైతులకు సీసీఆర్సీ కింద నమోదు చేసుకుంటే... వాళ్లు  సైతం ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే వారికి రూ.7 లక్షలు పరిహారం ఇస్తున్నాం.


*ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నాం కాబట్టే..* చంద్రబాబునాయుడు గారికి దత్తపుత్రుడైన ఒక పెద్ద మనిషి... రైతుల పరామర్శకు అని బయలుదేరాడు. ఆయన పరామర్శలో... పట్టాదారు పాస్‌ పుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకుంటే రూ.7లక్షలు దక్కని ఒక్కటంటే ఒక్క రైతును చూపించలేకపోయాడు. సీసీఆర్సీ కార్డు మీ గ్రామంలోని ఆర్బేకేలోనే అందుబాటులో ఉంది. ఆ సీసీఆర్సీ కార్డు ఉండి ఆత్మహత్య చేసుకుంటే రూ.7 లక్షలు పరిహారం అందని ఒక్క వ్యక్తినీ చూపించలేకపోయాడు. అంత గొప్పగా, పారదర్శకంగా పరిపాలన సాగుతోంది.


 ఏ పంట సీజన్‌లో జరిగిన నష్టానికి ఆ పంట నష్ట పరిహారం.. ఆ సీజన్‌ ముగిసే లోగా రైతుల ఖాతాల్లోకి ఇవ్వడం అన్నది  రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా... భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా చేస్తున్నాం.  ఏ రైతన్న నష్టపోయినా ఆ నష్టపరిహారం ఆ సీజన్‌ ముగిసేలోగా ఇచ్చే గొప్ప పరిపాలన ఈమూడేళ్లలోనే జరుగుతోంది.


*ఇ– క్రాప్‌ – ఒక్క రూపాయి కట్టకుండానే...*

రైతు బీమాలో రైతు వాటాగా చెల్లించాల్సిన మొత్తం కూడా రైతుల తరపున చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. ప్రతి గ్రామంలో ఆర్బీకేలు ఉంటాయి, అక్కడే ఇ–క్రాప్‌ బుకింగ్‌ చేసి, అందరికీ రశీదులు ఇచ్చి, పంటను ఇన్సూరెన్స్‌లోకి తీసుకొచ్చి నమోదు చేసే కార్యక్రమం చేస్తున్నారు.


ఒక సీజన్‌లో జరిగిన నష్టం మరలా రెండో ఏడాది అదే సీజన్‌ రాకమునుపే... ఆ ముందు సంవత్సరానికి  సంబంధించిన ఇన్సూరెన్స్‌ సొమ్ము రైతుల చేతుల్లో పెట్టే గొప్ప పథకం రాష్ట్రంలో అమలు అవుతోంది. దీనికి రైతులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.


*స్పందించే ప్రభుత్వం మనది...* 

కృష్ణా, గోదావరి డెల్టాతోపాటు ఉత్తరాంధ్రా, రాయలసీమకు అత్యధికంగా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా, కాలువలు ద్వారా నీళ్లిచ్చింది ఈ మూడు సంవత్సరాలలోనే. గతానికి, ఇప్పటికీ తేడా చూడండి. రైతులుకు ఇలాంటి మేళ్లు చేయాలంటే...  నేల తల్లి మీద వ్యవసాయం మీద, మన గ్రామం, మన సంస్కృతి, రైతు కూలీలు, రైతుల కష్టం మీద మమకారం, అవగాహన ఉండాలి. గత పాలకులెవ్వరికీ కూడా ఇవేవీ లేవు. 

సాగునీరు ఉండే ప్రాంతంలో రైతు కష్టాలు, ఉచిత విద్యుత్‌ బోర్లమీద ఆధారపడి సేద్యం చేసే మెట్ట ప్రాంతంలో రైతుల కష్టాలు మీద అవగాహన లేని పరిపాలనను మనం గతంలో చూశాం. ఈ రోజు ఏ ఒక్క రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా స్పందించే ప్రభుత్వం మనది. 


*నాయకుడు మాట ఇచ్చి తప్పితే...*

ఒక నాయకుడు ఎన్నికల్లో రైతుకు ఒక మాట ఇచ్చి.. దాన్ని తప్పితే రైతు ఏమవుతాడు అన్నది అర్ధం కాని ఏ నాయకుడైనా కూడా రాజకీయాల్లో ఉండడానికి తగునా ? అని ఈరోజు మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న వాళ్లందరినీ కూడా  ప్రశ్నించమని అడుగుతున్నాను. 



*మన దురదృష్టమేమిటంటే...*

మన దురదృష్టమేమిటంటే... రైతులకు ఉచిత విద్యుత్‌ వద్దన్న నాయకుడు, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతుల గుండెల మీద గురిపెట్టి బషీర్‌ బాగ్‌లో కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబు.  రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలిసంతకంలోనే మాఫీ చేస్తానని చెప్పి, 5 సంవత్సరాలలో కేవలం రూ.15వేలు కోట్లు మాత్రమే జమ చేశాడు. 


చివరికి తన వాగ్దానాన్ని నమ్మిన రైతులకు, వాళ్లు చేసిన పంటరుణాలకు, బంగారు రుణాలకు డబ్బులు చెల్లించనందున వడ్డీల భారం తడిసిమోపుడై... తర్వాత ఆ బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తున్నప్పుడు కూడా తన మనస్సు కరగని ఆ నాయకుడు పాలన ఒక్కసారి గుర్తుకుతెచ్చుకొమ్మని అడుగుతున్నాను.


*చంద్రబాబు రైతులను గాలికొదిలి...*

చెప్పడమేమో చెప్పారు, ఆ తర్వాత రైతులను గాలికి వదిలేశారు. వదిలేసిన తర్వాత రైతులు ఎలా బతుకున్నారు అని కనీసం ఆలోచన కూడా గత పాలకులు చేయలేదు.

 ఈ విషయాలు ఏ మాత్రం పట్టించుకోకుండా... దత్తపుత్రుడు బాధ్యత లేనట్టుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా.. చంద్రబాబునాయుడుగారంటే విపరీతమైన ప్రేమ చూపించాడు.

ఈ రోజు ప్రశ్నిస్తున్నాను అని చెప్పుకుంటున్న ఈ దత్త పుత్రుడిని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాను.


*ఎల్లో మీడియా – మొసలి కన్నీరు...*

 ఈ విషయాలను ఏనాడూ కూడా తమ పత్రికల్లో కానీ, తమ టీవీలలో కానీ ఎల్లో మీడియా చెప్పదు, చూపించదు. ఆరోజు చంద్రబాబునాయుడు రైతులను అడ్డగోలుగా మోసం చేస్తే ప్రశ్నించని.. ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడిన ఈ దుష్టచతుష్టయం అంతా .. ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నారు.

అసలు వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడే అర్హత వీళ్లకు ఉందా అని ప్రశ్నిస్తున్నాను. 


*ఇప్పటికీ గతానికీ తేడా చూడండి ? ...*

వ్యవసాయం గురించి మన ప్రభుత్వం ఏం చేసిందో.. గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. నేను కొన్ని ప్రశ్నలు అడగుతాను, ఆ ప్రతి ప్రశ్న గతానికీ, ఇప్పటికీ తేడా చూపిస్తుంది. తేడా ఏంటన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. 


1.

రైతుకు మన ప్రభుత్వం ప్రతియేటా రూ.13,500  రైతుభరోసా సాయం మూడేళ్లుగా అమలుచేస్తున్నాం. గతంలో 2014–19 మధ్యలో ఇటువంటి పథకం ఉందా ? 

సొంత భూమి సాగుచేసుకుంటున్న  రైతులతో పాటు అర్హులైన ఎస్సీలు,ఎస్టీలు, బీసీ,మైనార్టీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న వారికి కూడా వైయస్సార్‌ రైతు భరోసా మాదిరిగా రూ.13,500 పెట్టుబడి సహాయం అందిస్తున్న పరిస్థితి గతంలో ఉండేదా ? ఆలోచన చేయండి ?


మన మేనిఫెస్టోలో మనం ప్రతి రైతన్నకు రూ.12,500 చొప్పున 4 ఏళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ రూ.13,500 చొప్పున చెప్పిన  నాలుగేళ్లకు బదులు 5 సంవత్సరాలు ఇస్తున్నాం. అంటే 5 సంవత్సరాలు ముగిసే సరికి ప్రతి రైతు చేతిలో రూ.67,500 పెట్టే కార్యక్రమం జరుగుతుంది. 


2.

రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని కేవలం ముష్టి వేసినట్లు... రూ.15వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న ఆప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి?. 

ఈ మూడు సంవత్సరాల కాలంలోనే 50 లక్షలకు పైగా రైతులకు రైతుభరోసా పథకం ద్వారానే ఇచ్చింది రూ.23,875 కోట్లు. రాష్ట్ర చరిత్రలో ఏనాడైనా ఇంతగా సహాయపడే ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా ? 


3.

మనందరి ప్రభుత్వంలో వైయస్సార్‌ సున్నావడ్డీ ద్వారా 65.65 లక్షల మంది రైతులకు గతంలో మాదిరిగా కాకుండా రైతన్నలను ప్రోత్సహిస్తూ.. కేవలం మూడేళ్లలో రూ.1282 కోట్లు మనం ఇస్తే..  ఐదేళ్లు పరిపాలన చేసిన పెద్దమనిషి కేవలం రూ.782 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 


4.

మనం ఇస్తున్నమాదిరిగా కరువులు,వరదల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంటనష్టపరిహారాన్ని అదే సీజన్‌లో ఇచ్చే పరిస్థితి గతంలో ఉందా ? ఆలోచన చేయండి. పంట నష్టం జరిగితే పరిహారం ఎప్పుడు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి నుంచి పంట నష్టం జరిగిన వెంటనే సీజన్‌ ముగిసేలోగా ఆర్బీకేల పరిధిలో జాబితాలు ప్రదర్శించి.. ఎవరైనా మిస్‌ అయితే పేర్లు నమోదు చేసుకోమ్మని చెబుతూ.. ఇ–క్రాప్‌తో అనుసంధానం చేసి పంట నష్టపరిహారం ఇస్తున్నాం. గతానికి ఇప్పటికీ తేడా చూడండి.


ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ... విత్తనం నుంచి అమ్మకం వరకూ ప్రతి అడుగులోనూ రైతుకు సహాయపడుతున్నాం. రైతు భరోసా కేంద్రాలను మన గ్రామంలోనే స్ధాపించి వాటి ద్వారా రైతులకు ఇ–క్రాప్‌ బుకింగ్‌ అక్కడే చేస్తూ.. దానివల్ల లభించే ఉచిత పంటలబీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ చెల్లింపు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యక్రమాలు అన్నీ పారదర్శకంగా అక్కడే జాబితా ప్రదర్శించి.. ఇచ్చే వ్యవస్ధ గతంలో ఉందా ?అన్న ఆలోచన చేయండి. 


రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బీమాలో వాళ్లు కట్టాల్సిన డబ్బు కోసం.. వారికి బ్యాంకు రుణాలు అందినప్పుడు ఆ డబ్బులో బీమా సొమ్మును మినహాయించుకుని వారికి మాత్రమే వర్తింపజేసేవారు. మిగిలిన వాళ్లకి ఎలా బీమా కట్టాలో కూడా తెలియదు. కట్టిన సందర్భాలు కూడా చాలామంది రైతులకు లేదు. కానీ ఈ రోజు ప్రతి రైతు పేరుమీద ఆర్బీకేలోనే ఇ–క్రాప్‌ బుకింగ్‌ జరుగుతుంది. దాంతో పాటు ఇన్సూరెన్స్‌లో తన పేరుమీద నమోదవుతుంది.  పంట నష్టం జరిగితే ప్రతి రైతుకూ ఇన్సూరెన్స్‌ డబ్బు క్రమం తప్పకుండా..ఈ సీజన్‌లో నష్టం జరిగితే వచ్చే సీజన్‌ రాక మునుపే ఆ డబ్బులు జమ అవుతున్నాయి. ఇటువంటి వ్యవస్ధ గతంలో ఉండేదా ? తేడా చూడండి.



ఈ మూడేళ్లలో వైయస్సార్‌ ఉచిత పంటల బీమా ద్వారా అందించిన, రేపు నెలలో అందించనున్న మొత్తాన్ని కూడా కలుపుకుంటే.. 31 లక్షల మంది రైతులకు దాదాపుగా రూ.5వేల కోట్లు సొమ్ము ఇన్సూరెన్స్‌గా రైతులు ఖాతాల్లో జమ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? ఆలోచన చేయండి.


*అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతోంది.* ఎక్కడా లంచాలు లేవు, వివక్షకు తావులేదు. అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఆ రైతన్న నాకు ఓటు వేసినా, వేయకపోయినా మంచి చేసే పరిస్థితి జరుగుతుంది. గతానికీ ఇప్పటికీ తేడా ఇదే.



5.

కేంద్రప్రభుత్వం కనీస మద్ధతు ధరలు ప్రకటించిన 6 పంటలకు కూడా రైతు తక్కువ రేటుకు అమ్ముకుని నష్టపోకుండా.. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? ఆలోచన చేయండి.


ఆర్బీకేల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించని పంటలకు సైతం ఎంఎస్‌పీ ప్రకటించి, ఏ రైతు అయినా కూడా ఎంఎస్‌పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి వస్తే... ప్రభుత్వమే దగ్గరుండి ఆ పంట కొనుగోలుచేస్తోంది. ఇలాంటి కార్యక్రమం గతంలో ఉండేదా ? ఆలోచన చేయండి. 



అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు.. వారికి రూ.1.50 కే కరెంటు సబ్సిడీ ఇస్తూ.. మూడేళ్ల కాలంలో రూ.2403 కోట్లు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మనదే. ఆక్వా రైతులకు సంబంధించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. ఈ ప్రాంతంలో ఆక్వా సాగు ఎక్కువ.


*ఆక్వా రైతులకు అండగా....* 

కోవిడ్‌ సమయంలో ఆక్వా సాగు రైతులు నష్టపోకూడదని వారికి తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. కేవలం పశ్చిమ గోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగును 55,866 మంది రైతులు చేస్తున్నారు. 5 ఎకరాల్లోపు సాగును 87 శాతం మంది సాగుచేస్తున్నారు.వీరు సాగు చేస్తున్న ఏరియా 70,518 ఎకరాలు. కార్పొరేట్‌ వ్యవసాయం చేస్తున్న 13 శాతం మంది అంటే 5 వేల మంది రైతులు.. 60 శాతం భూమిలో ఆక్వా సాగు చేస్తున్నారు. కార్పొరేట్‌ సాగు చేస్తున్న రైతులకు  కూడా కోవిడ్‌ సమయంలో అండగా నిలబడ్డాం.


కోవిడ్‌ సమయం దాటిన తర్వాత మేలు చేయాల్సింది ఎవరికైనా ఉంది అంటే అది చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే. అందుకనే... 5 ఎకరాలలోపు ఉన్న వాళ్లందరికీ రూ.1.50 సబ్సిడీ కొనసాగుతుంది. మిగిలినవాళ్లకి రూ.3.80 ఉంటుంది. ఈ అమౌంట్‌ కూడా సబ్సిడీ మొత్తమే. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఈ రేటు కూడా ఇస్తున్నాం. దీనిపై కొంతమంది నాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు రెండేళ్లు పెట్టుకుని ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారని అడిగారు. మోసం చేయడం నాకు ఇష్టం లేదు.. ఏదైనా మంచి చేయాలంటే చెప్పాలి. ఎన్నికలతో సంబంధం లేకుండా చేయాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేయడం ధర్మమేనా అని తిరిగి ప్రశ్నించాను. నాకూ చంద్రబాబుకూ మధ్య ఉన్న తేడా అదే ? నేను రాజకీయాల గురించి ఆలోచన చేయను. ప్రజలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయంతోనే అడుగులు వేస్తాను. అయినప్పటికీ ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పరిమితిని 10 ఎకరాల వరకు విస్తరింపజేయమన్నాడు. 

ఆక్వా జోన్‌లో ఉన్న 10 ఎకరాల వరకు రూ.1.50 సబ్సిడీని విస్తరిస్తాం. ఈవిషయం ప్రతి రైతుకూ సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను. 


*పాడి రైతుల కోసం అమూల్‌...*

గతంలోపాడి రైతులు అంటే మోసం చేయడానికి మాత్రమే చూసే పరిస్తితి. వారి దగ్గర నుంచి ఎలా డబ్బులు రాబట్టుకోవాలి అన్న పరిస్థితి నుంచి ఇవాల అమూల్‌ సంస్ధను రంగంలోకి తీసుకొచ్చి లీటర్‌ పాలుమీద రూ.5 నుంచి రూ.10 అదనంగా ఇస్తున్నాం. ఈ రోజు అమూల్‌  ఈ ధర ఇస్తుంది కాబట్టి మిగిలిన డైరీలన్నీ... చంద్రాబాబు గారి డైరీ హెరిటేజ్‌తో సహా పోటీని తట్టుకునేందుకు అందరూ రైతులకు లీటరకు రూ.5–10 ఇవ్వవల్సిన పరిస్థితి.


*147 నియోజకవర్గాల్లో ల్యాబ్‌లు....* 

నియోజకవర్గ స్ధాయిలో 147 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. వాటి ద్వారా ప్రతి పరీక్షా జరుగుతుంది. గ్రామీణప్రాంతాల్లో 147, జిల్లా స్ధాయిలో 13 పెద్ద ల్యాబ్‌లు, ఆ తర్వాత ప్రాంతీయ స్దాయిలో మరో 4 పెద్ద ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. రైతులు కొనుగోలు చేసే పంట విత్తనం మొదలుకుని, పెస్టిసైడ్‌తో పాటు రైతు ఏం కొనుగోలు చేసినా నాణ్యతతో ఇస్తున్నారా ?లేదా ?అని పరీక్షించేందుకు తద్వారా వారు మోసపోకుండా ఉండేందుకు ఇన్ని ల్యాబ్‌లు  స్దాపించాం. గతంలో ఇలా ఉండేదా ?ఆలోచన చేయండి.


*ఈ నిజాలన్నీ మీరే చెప్పండి...* 

రైతుల బాగు కోసం, వారికి మంచి చేసేందుకు అడుగులు వేస్తున్నాం. మరో విషయం కూడా రైతులకు చెప్పాలి. ఇవన్నీ చేయని గత ప్రభుత్వంలో రైతులు  బాగున్నారని.. అన్ని రకాలుగా వారికి మంచి చేస్తున్న మన ప్రభుత్వంలో రైతులుకు బాగా లేదని దుష్ప్రచారం చేస్తున్న వారికి ఈ నిజాలన్నీ కూడా దయచేసి మీరే చెప్పండి. 


*చంద్రబాబు మేనిఫెస్టో– చెత్తబుట్టలో..*

2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి మేనిఫెస్టో విడుదల చేశారు. దీన్ని విడుదల చేసిన పెద్దమనిషి ఆ తర్వాత తన తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ నుంచి కూడా మేనిఫెస్టోను తీసేశారు. మేనిఫెస్టో అంటే ప్రజలను మోసం చేయడానికి ఎన్నికలప్పుడు చెప్పాల్సిన మాటలు. ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు ఎలాగూ మోసపోతారు కాబట్టి మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తున్న ఈ పెద్ద మనిషి నైజం ఒక్కసారి గమనించండి.


దీనికి తేడా మన పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు, పార్టీ ప్రతినిధులు మన మేనిఫెస్టోను తీసుకొచ్చి.. ప్రతి ఇంటికి (నేను) జగనన్న రాసిన లేఖను ఇస్తున్నారు. ప్రతి ఇంటికి ఏం మేలు జరిగిందో చూపిస్తూ.. గుర్తు చేస్తూ ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోను మీరే టిక్‌ పెట్టండి అని ప్రతి ఇంటికి .. మీ అందరి చల్లని దీవెనలు కోసం, ఆశీస్సులు కోసం వస్తున్నారు. ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి. 



గతంలో చంద్రబాబు మేనిఫెస్టోతో పాటు లేఖలు రాశాడు. ఇందులో దత్తపుత్రుడుది, చంద్రబాబుది వీళ్లెవరూ చాలరన్నట్టు మోడీ గారి ఫోటో కూడా పెట్టారు. ఆ మేనిఫెస్టోను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే... కనీసం ప్రజల పక్షాన నిలబడి వారిని ఎందుకు మోసం చేశావని ప్రశ్నించడానికి అడుగులు ముందుకు వేయని ఈ దత్తపుత్రుడుని ఏమనాలి ? 


ఈనాడు,ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈ దుష్ట చతుష్టయం అంతా కలిసి రంధ్రాలు వెతికే కార్యక్రమం చేస్తున్నారు. మంచి చేస్తున్నా దాన్ని అబద్దం అని చెప్పి వక్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు.


*మీ అందరికీ ఒక్కటే విన్నపం...* జగన్‌ రైతుల తరపున నిలబడే మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒక మాదిరిగా.. అయిపోయిన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదు. నిజాయితీ, నిబద్దత ఉంది. ఏది చెప్తాడో అదే చేస్తాడు. 


ఇటువంటి మంచి పరిపాలనకు దేవుడు ఆశీస్సులు ఉండాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ బటన్‌ నొక్కి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. 


ఎమ్మెల్యే వాసు గణపవరంను భీమవరంలోకి కలపాలన్నాడు.  కొల్లేరు ప్రాంతంలో రీ సర్వే చేయించాలన్నాడు. దానికి ఆదేశాలు ఇచ్చాం. అవి రాబోయే రోజుల్లో అమలుఅవుతాయి. కొల్లేరు ప్రాంతంలో చెట్టన్నపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో తాగునీటి కొరకు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం అడిగారు. కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణం కావాలన్నాడు. టెండర్ల ప్రక్రియ పూర్తైంది. జూన్‌లో శంకుస్ధాపన చేస్తాను. ఉంగుటూరులో 6 సబ్‌స్టేషన్లు కావాలని అడిగారు. సర్వే చేయించి.. అవసరమైన చోట వచ్చేట్టు చేస్తాం.ఏలూరు కాలువపై నారాయణపురం, ఉంగటూరు, పూళ్ల, గుండుగొలను గ్రామాల్లో వంతెన నిర్మాణాలు అడిగారు. అవి కూడా చేస్తాం. నారాయణపురం, ఉండి రోడ్డులో..  వెంకయ్య వయ్యేరు కాలువపై కొత్త వంతెన అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. 48 పాత ఇందిరమ్మ కాలనీల్లో కనీస వసతులు కోసం అడిగారు. అవి కూడా చేపడతాం అని సీఎం హామీ ఇస్తూ తన ప్రసంగం ముగించారు. 


అనంతరం  నాలుగో ఏడాది మొదటి విడతగా ఇచ్చే రైతు భరోసా సాయం రూ.7,500లకు గానూ రూ.5,500లను ఏలూరు జిల్లా గణపవరంలో బటన్‌ నొక్కి  రైతుల ఖాతాల్లో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ జమ చేశారు. 

ఈ నెల 31న రైతుల ఖాతాల్లో  జమ కానున్న పీఎం కిసాన్‌ నిధులు మరో 2వేలు.

దీంతో మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ కానున్నాయి.


ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు,  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image