జాబ్‌ క్యాలెండర్‌లో మిగిలిన 8వేలకుపైగా పోస్టులు సత్వరమే భర్తీ*జాబ్‌ క్యాలెండర్‌లో మిగిలిన 8వేలకుపైగా పోస్టులు సత్వరమే భర్తీ*

*ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టి*

*పోలీసు రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ*

*2021–22 జాబ్‌ కాలెండర్‌ ద్వారా మొత్తంగా 39,654 మంది నియామకం*


అమరావతి (ప్రజా అమరావతి);

*–జాబ్‌ క్యాలెండర్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*

*–వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన సీఎం.* 


– ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సమగ్రంగా సమీక్షించిన సీఎం.  

– జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్‌ చేసిన పోస్టుల వివరాలను ముఖ్యమంత్రికి నివేదించిన అధికారులు. 

– బ్యాక్‌లాక్‌ పోస్టులు, ఏపీపీఎస్‌సీ, వైద్య, ఆరోగ్య – కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌ మెంట్‌ను సమగ్రంగా సమీక్షించిన సీఎం. 


*2021–22లో 39,654ల పోస్టుల భర్తీ:*


– 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేసినట్టుగా వెల్లడించిన అధికారులు.

– ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ.

– గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి. 

– 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉంది. 

– భర్తీచేయాల్సిన పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయి.  


*రిక్రూట్‌ మెంట్‌పై సీఎం ఆదేశాలు :*

– 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేశాం:

– ఇవికాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షలమందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇచ్చాం:

– ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంద్వారా మరో 50వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకున్నాం:

– ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది:

– జాబ్‌ క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించుకోవాలి: సీఎం

– వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలి: సీఎం

– నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీచేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలి: సీఎం

– విద్యా, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామమన్న సీఎం

ఇక్కడ ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదు, భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు: సీఎం

– ఉన్నతవిద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీటవేసేలా నిర్ణయాలు ఉండాలని స్పష్టంచేసిన సీఎం. 

– రెగ్యులర్‌పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియమకాలు జరగాలన్న సీఎం.

– దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి. 


*పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై యాక్షన్‌ప్లాన్‌:*

– పోలీసు ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్‌ప్లాన్‌ రూపొందించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం. 

– పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలన్న ముఖ్యమంత్రి. 

– వచ్చే నెల మొదటివారంలో తనకు నివేదించాలన్న సీఎం. 

– కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి,  ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్త, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు మరియు హెచ్‌ఆర్‌ఎం) హెచ్‌ అరుణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments