ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రత్యేక దృష్టి

 :

నెల్లూరు (ప్రజా అమరావతి);

కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన  నిబంధనల ననుసరించి ఆత్మకూరు అసెంబ్లి నియోజక వర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రత్యేక దృష్టి


సారించాలని జనరల్ అబ్జర్వర్ శ్రీ యం. సురేష్ కుమార్, సూక్ష్మ  పరిశీలకులకు దిశా నిర్దేశం చేశారు.


శనివారం  మధ్యాహ్నం కలెక్టరేట్ లోని  తిక్కన ప్రాంగణంలో ఆత్మకూరు అసెంబ్లి నియోజక వర్గ ఉప ఎన్నికల పోలింగ్  నిర్వహణలో పాల్గొనే సూక్ష్మ  పరిశీలకులకు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో  జనరల్ అబ్జర్వర్ శ్రీ యం. సురేష్ కుమార్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు తో కలసి పాల్గొన్నారు.    ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ శ్రీ యం. సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల పోలింగ్ రోజున    సూక్ష్మ  పరిశీలకులు నిర్వర్తించాల్సిన విధులను తెలియచేసి, పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల పోలింగ్  నిర్వహణను పారదర్శకంగా నిర్వహించడంలో భాగంగా సూక్ష్మ  పరిశీలకులను  నియమించడం  జరిగిందని,  వీరంతా ఎన్నికల మార్గదర్శకాలను అనుసరించి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.   శిక్షణా కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను తప్పక పాటిస్తూ ఎన్నికల విధి నిర్వహణలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.  


కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, పోలింగ్ రోజున పోలింగ్  మొదలైనప్పటి నుండి  పూర్తి అయ్యేంత వరకు పోలింగ్ ప్రక్రియను  సూక్ష్మ దృష్టితో పరిశీలించాల్సి ఉంటుందన్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం జారి చేసిన  మార్గదర్శకాలకు అనుగుణంగా  పోలింగ్ జరుగుచున్నదా లేదా  అని సూక్ష్మ  పరిశీలకులు పరిశీలించాలన్నారు.  ముఖ్యంగా   ఆబ్సెంట్,  షిప్టింగ్, డెత్, డూప్లికేట్ ఓటర్స్ పై  ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.  పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏదైనా సమస్య వచ్చిన లేదా  సజావుగా పోలింగ్ జరగడం లేదని భావించిన వెంటనే సంబందిత సూక్ష్మ పరిశీలకులు, జనరల్ అబ్జర్వర్ దృష్టికి గాని  రిటర్నింగ్ అధికారి దృష్టికి గాని  తీసుకురావాలని  సూచించారు. 


భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ రోజున  సూక్ష్మ  పరిశీలకులు ఏ విధమైన విధులు నిర్వర్తించాలన్న అంశాలపై ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేందిర ప్రసాద్,  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ సాంబశివా రెడ్డి  పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా  సూక్ష్మ  పరిశీలకులకు వివరించారు.


ఈ శిక్షణా కార్యక్రమంలో  ఎల్.డి.ఎం. శ్రీ  శ్రీకాంత్ ప్రదీప్  కుమార్,   సూక్ష్మ  పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.


Comments