నెల్లూరు, (ప్రజా అమరావతి);
జిల్లాలో ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
జిల్లాలో ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలు నేపథ్యంలో గురువారం ఉదయం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జిల్లా లోని అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా సహకరించాల
ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఆయా రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తీసుకోవాల్సిన అనుమతులను ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగానే ముందస్తుగా సంబంధిత అధికారులు నుండి అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనటరింగ్ కమిటి (ఎం.సి.ఎం.సి ) ద్వారా ముందస్తుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. రేడియో, సినిమా హాళ్ళు, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేముందుగా, బల్క్ ఎస్.ఎం.ఎస్. లు పంపేముందుగా అనుమతి పొందాలన్నారు. కరపత్రాలు, హ్యాండ్ బిల్స్ ఇతర ఎన్నికల డాక్యుమెంట్లు ప్రచురించినప్పుడు విధిగా దానిపై ప్రచురణ కర్త పేరు, చిరునామా, ప్రింటర్ పేరు ప్రచురించాలన్నారు. ఉప ఎన్నికలకు సంబంధించి 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ల జాబితాలను అన్నీ పార్టీలకు పంపడం జరిగిందని, ఈ.వి.ఎం లపై ప్రజల్లో అవగాహన కల్పించుటకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ కు సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూముల ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ ఏజెంట్స్ వివరాలు ముందుగానే పంపాలని జిల్లా ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీ సుబ్రమణ్యం, వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ శ్రీ వై. మురళిధర్ రెడ్డి, టి.డి.పి. పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, బి.జె. పి జిల్లా ఎన్నికల కన్వీనర్ శ్రీ ఎం. కాళేశ్వర రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీ బాలసుధాకర్, బీఎస్పీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ ఎస్. సద్విన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment