*వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష*
అమరావతి (ప్రజా అమరావతి):
*–వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*–సమగ్ర సర్వే వివరాలను సీఎంకు వివరించిన అధికారులు.*
*–ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సమీక్షించిన సీఎం.*
*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*
– సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయి: సీఎం
– దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది:
– భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి:
– సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోండి:
– అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవాలని ఆదేశించిన సీఎం.
– డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, అలాగే సర్వే రాళ్లు సమకూర్చుకోవడం... ఇలా ప్రతి అంశంలోనూ వేగం ఉండాలన్న సీఎం :
– సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి:
– 100 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, ఈ సర్వేను పూర్తిచేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న సీఎం.
సమీక్షా సమావేశంలో పాల్గొన్న రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయడు, అటవీ పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇతర ఉన్నతాధికారులు.
addComments
Post a Comment