వైయస్సార్‌ యంత్ర సేవా పథకం – ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్ల మెగా పంపిణీ.

 

అమరావతి (ప్రజా అమరావతి);


వైయస్సార్‌ యంత్ర సేవా పథకం – ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్ల మెగా పంపిణీ.


రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో...వైయస్సార్‌ యంత్ర సేవా పథకం.


3800 ఆర్బీకే స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు 3800 ట్రాక్టర్లు, 1140 ఆర్బీకే స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ పనిముట్లు మరియు 320 క్లస్టర్‌ యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ...5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీ జమ.


నేడు (07.06.2022) గుంటూరులో రాష్ట్రస్ధాయి మెగా పంపిణీని జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


రైతన్నలకు ఆర్‌బీకేల వద్దే, మీ గ్రామంలోనే తక్కువ అద్దెకే సాగు యంత్రాలు, పనిముట్లు అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను సకాలంలో అందించడానికి తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి రైతన్నలకు మరింత రాబడి అందించేలా, వారికి మంచి జరిగేలా రూ. 2,016 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్ధాయిలో ఒక్కొక్కటి రూ. 15 లక్షల విలువ గల 10,750 వైయస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ గల కంబైన్‌ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.


ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్‌ లింకేజ్, హిచ్, డ్రాబార్‌లు ఉచితంగా పంపిణీ, కంబైన్‌ హార్వెస్టర్లతో ఒక ట్రాక్‌ ఒక సంవత్సరం పాటు ఉచిత సర్వీసింగ్, ఆపరేటర్‌కు ఉచిత శిక్షణ.


రాష్ట్రవ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలతో కలిపి శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు 6,781 ఆర్బీకే స్ధాయి మరియు 391 క్లస్టర్‌ స్ధాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు దాదాపు రూ. 691 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ...మిగిలిన కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు కూడా త్వరలోనే పంపిణీ.


వ్యవసాయం దండగ అంటూ సాగును నిర్లక్ష్యం చేసి అన్నదాతలను కడగండ్ల పాలు చేసిన గత పాలకుల నాటి దుస్ధితిని సమూలంగా మారుస్తూ...రైతన్నకు ప్రతి అడుగులోనూ వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండగగా మార్చిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

Comments