నెల్లూరు, జూన్,15 (ప్రజా అమరావతి):
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఆత్మకూరు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు
పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.
బుధవారం ఉదయం ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 23న జరిగే పోలింగ్ కు ఈవీఎంలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే (ఈవీఎంల కమిషనింగ్) ప్రక్రియను రిటర్నింగ్ అధికారి శ్రీ హరేంధిరప్రసాద్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
తొలుత స్ట్రాంగ్ రూమ్ లోని బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ లు, వివి ప్యాట్లను లైబ్రరీ హాలులో ఏర్పాటుచేసిన 38 టేబుళ్లకు పోలింగ్ సిబ్బంది తరలించి కమిషనింగ్ ప్రక్రియను ప్రారంభించగా, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ లు సరిగ్గా పనిచేస్తున్నాయా, లేదా అనే విషయాన్ని సిబ్బంది జాగ్రత్తగా పరిశీలించి, లోటుపాట్లను సరిచేసి అందులో బ్యాలెట్ పేపర్ ను అమర్చి సీల్ వేసే ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించి, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు.
రిటర్నింగ్ అధికారి శ్రీ హరేంధిరప్రసాద్, ఆత్మకూర్ ఆర్డిఓ, నోడల్ అధికారి శ్రీ బాపిరెడ్డి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ శ్రీ సోమ్లా నాయక్, సెక్టార్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్ లు, ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment