రామాయపట్నం, నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);
*రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ పనులకు సీఎం శ్రీ వైఎస్ జగన్ శంకుస్ధాపన*
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, స్ధానికులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*గుడివాడ అమర్‌నా«ద్, పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖా మంత్రి*
ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు, భారతదేశంలో తూర్పువైపున అత్యంత పెద్ద సముద్రతీరం కల్గిన రాష్ట్రం మన ఏపి. దేశంలోనే రెండో అతి పెద్ద సముద్రతీరం కల్గిన రాష్ట్రం మనది. ఇక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి, పోర్టుల నిర్మాణం, పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాలి, మనకు ఉన్న 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని వినియోగించుకుని తద్వారా రాష్ట్రానికి ఆర్ధిక పురోగతి తీసుకురావాలని సీఎం గారు మ్యారిటైమ్ బోర్డు ద్వారా రూ. 15 వేల కోట్లు ఖర్చుపెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు కానీ మనకున్న వనరులు ఏ రకంగా వినియోగించుకోవాలని ఆలోచించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ మాత్రమే. రామాయపట్నం పోర్టుతో పాటు, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు, 9 పిషింగ్ హార్బర్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న 6 ఆపరేషనల్ పోర్టులు కానీ ఇవన్నీ కలిపి పూర్తిస్ధాయిలో అభివృద్ది జరగాలని సీఎంగారి ఆలోచనా విధానానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఏ రోజు కూడా సీఎం గారు ఏం చేయాలన్నా ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులతో ముందుకెళతారు. కానీ చంద్రబాబు మాత్రం శంకుస్ధాపన ఎక్కడ చేశారు, 2019 లో ఎన్నికలకు రెండు నెలల ముందు హడావిడిగా శంకుస్ధాపన చేసి నేనే చేశానంటున్నారు, కనీసం ఒక్క అనుమతైనా ఉందా అప్పుడు, చంద్రబాబుకు ఒక అలవాటు, ఆయనతో పాటు ఒక తాపీ మేస్త్రిని, నాలుగు ఇటుకలు తీసుకువెళ్ళి ఎక్కడ కనబడితే అక్కడ శంకుస్ధాపనలు చేస్తారు, ఆయన వేసింది పునాదిరాళ్ళు కాదు, సమాధిరాళ్ళు. ఈ రామాయపట్నం పోర్టును మళ్ళీ ప్రారంభించేది శ్రీ జగన్ గారే, ఇచ్చిన గడువులోగా నిర్మాణం పూర్తవుతుంది. పారిశ్రామిక అభివృద్దిలో కూడా రాష్ట్రం పరుగులు తీస్తుంది, ధ్యాంక్యూ.
*సుజాత, మెండివారిపాలెం గ్రామస్తులు*
అన్నా పోర్టు అనేది మాకు ఒక కల, ఎప్పటినుంచో పోర్టు వస్తుందన్నారు కానీ రాలేదు. ఇప్పుడు పోర్టు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్ధానికులకు చదువుకున్నా ఉద్యోగావకాశాలు లేవు, కానీ మీరు 70 శాతం స్ధానికులకే ఉద్యోగావకాశాలు ఇస్తామన్నారు, సంతోషం...పోర్టుకు మా భూమి ఒక ఎకరా ఇచ్చాం, దానికి రూ. 15 లక్షలు ఇచ్చారు, ఆ డబ్బును మా కుటుంబాన్ని మెరుగుచేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాం. మీకు ఎంతో రుణపడి ఉంటామన్నా, మేమంతా మత్స్యకార కుటుంబాలకు చెందిన వాళ్ళం, మాకు వేట నిషేద సమయంలో మీరు ఏడాదికి రూ. 10 వేలు ఇస్తున్నారు, గతంలో రూ. 4 వేలు మాత్రమే ఇచ్చేవారు. అప్పుడు పాదయాత్రలో చెప్పినట్లుగా మా సంఘానికి వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా సాయం అందింది, చాలా సంతోషంగా ఉంది, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. మా ఇంట్లోవారు గతంలో ఫించన్‌ల కోసం తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఇంటికే తెస్తున్నారు, నాకు అమ్మ ఒడి వస్తుంది, మా పాప కూడా నాకు జగన్ మామయ్య అమ్మ ఒడి ఇస్తున్నారని సంతోషంగా చెబుతుంది. మేమంతా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, మాకు ఒక అన్నగా మీరు అండగా ఉన్నారు. మా ఊరికి మీరు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మీరే పదికాలాల పాటు సీఎంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
*ఆవల జయరామ్, ఉలవపాడు మండలం గ్రామస్తులు*
ఈ రోజు ఈ ప్రాంతానికి పండుగ, మన ప్రాంతానికి వచ్చి పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన జగనన్నకు మత్స్యకారుల తరపున ధన్యవాదాలు. జగనన్న తన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు, మన మత్స్యకారులకు మత్స్యకార భరోసా హామీ ఇచ్చారు, మన కష్టార్జితం గుర్తించి మనకు అన్నీ అందేలా చేస్తున్నారు. గతంలో డీజిల్ సబ్సిడీ ఎప్పుడిచ్చేవారో తెలీదు కానీ ఇప్పుడు జగనన్న స్పాట్‌లోనే సబ్సిడీ ఇస్తున్నారు. వేట సమయంలో మరణిస్తే గతంలో రూ. 5 లక్షలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు జగనన్న రూ. 10 లక్షలకు పెంచారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ అన్నారు కానీ ఎవరూ చేయలేదు, జగనన్న మాత్రం శరవేగంగా నిర్మాణం చేపట్టారు, రామాయపట్నం పోర్టు గురించి జగనన్న పాదయాత్రలో చెప్పిన మాటకు కట్టుబడి మన పోర్టు భూమి పూజకు వచ్చారు. మత్స్యకార కుటుంబాలలో చిన్న చిన్న ఆక్వారైతులు ఉన్నారు, వారి కష్టాలు గుర్తించి యూనిట్ రూపాయిన్నరకి తగ్గించారు. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి మాకు అన్ని పథకాలు అందజేస్తున్నారు. ధ్యాంక్యూ సార్.
addComments
Post a Comment