శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోడూరు కు చెందిన శ్రీ కోదండ రామ భజన బృందం, విజయవాడకు చెందిన శ్రీ కనకదుర్గా గాయత్రి శక్తి పీఠం వారు, గుంటూరు కు చెందిన శ్రీ ఆర్యవైశ్య మహిళా సంఘము, విజయవాడకు చెందిన శ్రీ దుర్గాభవానీ గారి బృందం మరియు వివిధ ప్రాంతాలకు చెందిన బృందముల వారు శ్రీ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించుటకు విచ్చేసిన సందర్భంగా వారందరికీ ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది.
అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహింపజేసి, అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగినది.
శ్రీ అమ్మవారికి ఆషాడ సారెను సమర్పించ దలచినవారు సంప్రదించవలసిన నెంబర్లు 18004259099 లను ఆఫీస్ వేళల యందు మూడు రోజులు ముందుగా సంప్రదించి సమస్థ వివరములు, ఊరు, భక్తుల సంఖ్య, తదితర వివరాలను నమోదు చేసుకొనవలసినదిగా కార్యనిర్వహణాధికారి వారు ఒక ప్రకటనలో తెలిపియున్నారు.
addComments
Post a Comment