ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు స్టేజీ అప్డేషన్ చేయాలన్నారు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);



నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జగనన్న హౌసింగ్ కాలనీలలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను  త్వరగా పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, రెవెన్యూ, మునిసిపల్,  హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.


మంగళవారం కావలి మునిసిపల్ పరిధిలోని ముసునూరువద్ద ఏర్పాటు చేసిన  మెగా జగనన్న  లే అవుట్ లో  చేపడుతున్న  ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు  పరిశీలించి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను  ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ లే అవుట్ ఎన్ని ఎకరాలు, ఎన్ని ప్లాట్లు, ఎంతమంది లబ్ధిదారులు, ఇప్పటివరకు ఎన్ని ఇల్లులు ప్రారంభించారు, అవి ఏ దశలో ఉన్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకొని పరిశీలించారు. ఈ మెగా లేవుట్ లో 4109 ఇళ్లు మంజూరయ్యాయని, 275 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదని, బిబిఎల్   దశలో 2994, బియల్ దశలో 787 ఇళ్ళు, ఆర్. ఎల్ దశలో 47, ఆర్.సి దశలో 6 ఇళ్లు ఉన్నాయిని హౌసింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని జగనన్న హౌసింగ్ లేఔట్ లలో  చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి  ఎప్పటికప్పుడు స్టేజీ అప్డేషన్ చేయాలన్నారు


.   హౌసింగ్ కాలనీలో అప్రోచ్ రోడ్లు, నీటి, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణాల్లో పురోగతి చూపించేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, నిర్ధేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.


కలెక్టర్ వెంట  కావలి ఆర్.డి.ఓ శ్రీ శీనానాయక్, మునిసిపల్ కమీషనర్ శ్రీ శివారెడ్డి, హౌసింగ్ శాఖ ఈఈ. శ్రీ ఖాజా మోహిద్దీన్  హౌసింగ్ శాఖ  అధికారులు తదితరులు ఉన్నారు.


Comments