శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరా


వతి):  

    ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా  ఈరోజు విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘము 200 మంది, శ్రీ కనకదుర్గా లలితా పారాయణ బృందం 100 మంది, శ్రీకరి సేవా సమితి వారు 130 మంది, ఎన్. సుమిత్రా గారి బృందం 70 మంది, అగర్వాల్ మహిళా మండలి వారి బృందం 51 మంది మరియు వివిధ ప్రాంతాలకు చెందిన పలు బృందముల వారు శ్రీ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించుటకు విచ్చేసిన సందర్భంగా వారందరికీ ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది.


 అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహింపజేసి, అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగినది.

Comments