శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):  

        దేవాలయ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం వారు దేవస్థానంనకు మంజూరు చేసిన రూ.70 కోట్ల రూపాయల ఆలయ అభివృద్ధి పనులలో భాగముగా ఘాట్ రోడ్ ద్వారా శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల భద్రత దృష్ట్యా కొండ చరియలు విరిగిపడు ప్రమాద నివారణ మరియు తీవ్రత ను తగ్గించుటకు జరుగుచున్న రాక్ మిటిగేషన్ పనులలో భాగంగా మెటీరియల్ లభ్యత లేకపోవడం వలన కొంత మేర పనులు ఆగగా, ఇపుడు మెటీరియల్ లభ్యత అయ్యి పనులు కొనసాగుచున్నవి.

 సదరు పనులు నిర్వహించుటలో భాగముగా భక్తుల రక్షణ దృష్ట్యా కాంట్రాక్టర్ వారు ఘాట్ రోడ్ ద్వారా ది.01-08-2022 నుండి ది.03-08-2022 వరకు  వాహనములను నిలుపుదల చేయవలసిందిగా దేవస్థానం వారిని కోరియున్నారు.


అందువలన ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా ఉన్న రాక్ మిటిగేషన్ పనుల నిమిత్తం ముందస్తు జాగ్రత్తగా ఘాట్ రోడ్ నందు పై మూడు రోజులు భక్తుల వాహనములు నిలుపుదల చేయడమైనదని తెలియజేయడమైనది.Comments