గతంలో ఏదైనా సంక్షేమ పథకం పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉండేది



నెల్లూరు, జూలై 20 (ప్రజా అమరావతి):  గతంలో ఏదైనా సంక్షేమ పథకం పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉండేద


ని, తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ఎటువంటి అవినీతికి తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పునరుద్ఘాటించారు. 

 బుధవారం సాయంత్రం ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలో  అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.  ప్రతి ఇంటికి వెళ్లి ఇప్పటివరకు వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, అర్హత ఉండి  ఏమైనా సంక్షేమ పథకాలు అందలేదా? ఇతర సమస్యలైన ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సూచించిన కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. ప్రతి గడపలోనూ మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికి ప్రభుత్వ పనితీరు, తాము పొందిన సంక్షేమ పథకాల లబ్ధిని మంత్రితో ఆనందంగా పంచుకుని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల పూర్తి విశ్వాసం, సంతృప్తి వ్యక్తం చేశారు. 

 అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ వల్లూరు గ్రామంలో ఈ మూడేళ్లలో సుమారు ఐదు కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామంలో సిమెంటు రోడ్లు నిర్మించామని చెప్పారు. అలాగే పశు వైద్యశాల అభివృద్ధికి మరో పది లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యాయని, అలా కాకుండా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కులమతాలకతీతంగా, పారదర్శకంగా అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని చేపట్టినా, తమ ముఖ్యమంత్రి చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్లడం ఒక చరిత్ర గా నిలిచిపోతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడ కూడా ఎవరూ చేపట్ట లేదన్నారు. వల్లూరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

 ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో శ్రీమతి ప్రత్యూష, తాసిల్దార్ మనోహర్ బాబు, వైసీపీ మండల కన్వీనర్  విష్ణువర్ధన్ రెడ్డి, అధికారులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.


Comments