అర్హత ఉండి టెక్నికల్‌ సమస్యల వల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు కూడా ఆయా పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం ఇది


అమరావతి (ప్రజా అమరావతి);


*అర్హులైన 3,39,096 మంది లబ్ధిదారులకు రూ. 137 కోట్లను బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నేడు జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక క్రింద నేడు కొత్తగా 2,99,085 మందికి ఏటా రూ. 935 కోట్ల అదనపు వ్యయంతో కొత్త సామాజిక పెన్షన్లు...కొత్తగా మంజూరు చేస్తున్న 7,051 బియ్యం కార్డులతో కలిపి ఇప్పటివరకు 1,45,47,036 బియ్యం కార్డులు మంజూరు...నేడు కొత్తగా అందిస్తున్న 3,035 డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులతో కలిపి ఇప్పటివరకు 1,41,12,752 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే...*


*బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి*


అందరికీ నమస్కారం, సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ గారు తన పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలను క్యాలెండర్‌ ప్రకారం అమలుచేస్తున్నందుకు ప్రజలంతా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. అర్హత ఉండి టెక్నికల్‌ సమస్యల వల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు కూడా ఆయా పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం ఇది


. అర్హులయితే చాలు ప్రతీ పథకం ప్రతీ ఇంటికి చేరాలన్నదే శ్రీ జగనన్న ప్రభుత్వ లక్ష్యం. మీరే సీఎంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. వివిధ పథకాల క్రింద అర్హత కల్గిన లబ్ధిదారులందరికీ ఈ రోజు లబ్ధి అందజేస్తున్నాం. మేం గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతీ ఇంటికి వెళుతున్నప్పుడు ప్రతీ అవ్వా, తాత మా మనవడు జగన్‌ వల్లే మేం బ్రతికి ఉన్నామని గొప్పగా చెబుతున్నారు. ఎక్కడా ఒక్క రూపాయి లంచం లేకుండా, సిఫారసు లేకుండా బటన్‌ నొక్కితే నేరుగా వారి ఖాతాల్లోకి చేరడంతో ప్రతీ కుటుంబం ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరే సీఎం కావాలని యువత, అందరూ కోరుకుంటున్నారు. జగనన్న వల్లే మా పిల్లలు చదువుకుంటున్నారని మహిళలు అంటున్నారు. ఈ మాట ముఖ్యమంత్రిగారికి చెప్పమనడం మేం గర్వంగా భావిస్తున్నాం. ధ్యాంక్యూ.


*ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, గతంలో మనం చూశాం, టీడీపీ హయాంలో ఏ పథకం మొదలుపెట్టినా ఎంతమందికి ఇస్తారో తెలీదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. రుణమాఫీ అని తర్వాత దానిని నీరు కార్చారు, సీఎం శ్రీ జగన్‌ గారు బడుగు, బలహీనవర్గాలకే కాదు, సంక్షేమ పథకాలు అందరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు. ఈ మూడేళ్ళలో సుమారు రూ. 1.50 లక్షల కోట్లు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా అందించి దేశంలో ఆదర్శంగా నిలిచారు. అయినా ఎవరైనా నాకు పథకం రాలేదంటే వారికి కూడా అన్నీ అందించాలనే సీఎం గారి ఆలోచన ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. బడుగు, బలహీనవర్గాల, దళిత వర్గాల గుండె తడి తెలిసిన వ్యక్తిగా సీఎంగారు ఇంత చక్కని పాలన అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో శ్రీ జగన్‌ గారిని ముఖ్యమంత్రిని మరోసారి చేసుకోవడం ఒక చారిత్రక అవసరం. మీరు నిండు నూరేళ్ళు ఉండాలన్నా, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక శాశ్వత ముఖ్యమంత్రిగా, ఇంకా రెండు దశాబ్ధాల పాటు చక్కని పాలన అందించి, సంక్షేమ కార్యక్రమాలను అందించాలి. మీ స్పూర్తిదాయక నాయకత్వానికి హ్యట్సాఫ్‌. దేశానికే ఆదర్శంగా ఈ కార్యక్రమం నిలిచింది. నమస్కారం. 


*లక్ష్మి, లబ్ధిదారు, ఈబీసీ నేస్తం, శ్రీకాకుళం*


సార్, మీరు ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తం పథకం చాలా గొప్ప ఆలోచన, మేమంతా మీకు రుణపడి ఉంటాం. గతంలో ఏ సీఎం మా గురించి ఇలా ఆలోచించలేదు. ఈ పథకం కోసం నేను డిసెంబర్‌లో దరఖాస్తు చేసుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు, నేను ఈ ఏడాది రాదనుకున్నా, కానీ వచ్చింది. మీరు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల అందరికీ లబ్ధి జరుగుతుంది. నేను నా పిల్లలను కూడా చక్కగా చదివించుకుంటున్నాను. నాకు రుణమాఫీ వచ్చింది, నా కుటుంబ పోషణకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రతీ పేదవాడు ఆనందంగా, సంతోషంగా ఉండాలని మీరు ఎంతో చేస్తున్నారు. మేం హాయిగా, సంతోషంగా జీవిస్తున్నామంటే మీరే కారణం. మీరు ప్రతీ ఇంటి పెద్దలా ఉంటూ ఆనందాలను పంచుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మీరే ఘన విజయం సాధించి పేదవాడి జీవితంలో ఆనందాలను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 


*జ్యోతి, లబ్ధిదారు, జగనన్న చేదోడు, అనంతపురం జిల్లా*


జగనన్నా నమస్తే, అన్నా నేను జగనన్న చేదోడు పథకం ద్వారా రూ. 10 వేలు లబ్ధిపొందాను. నాకు జగనన్న తోడు పథకం కూడా అందింది, ఈ డబ్బుతో నా వ్యాపారం అభివృద్ది చేసుకున్నాను.  నేను డ్వాక్రా సంఘంలో కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధిపొందాను. గతంలో ఫించన్‌ కోసం క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడేవారు, కానీ ఇప్పుడు వలంటీర్‌ తెల్లవారుజామునే వచ్చి ఫించన్‌ ఇస్తున్నారు. నాకు ముందుసారి ఆధార్‌ లింక్‌ అవలేదన్న కారణంతో లబ్ధి జరగలేదు. కానీ ఇప్పుడు వలంటీర్‌ ఇంటికి వచ్చి థంబ్‌ వేయించుకుని మళ్ళీ పథకం అందేలా చేశారు. మాకు వివిధ పథకాలు అందాయి. మీరు ఓసీలకు కూడా ప్రభుత్వ పథకాలు అందించేలా చేసిన మొదటి సీఎం. మీరు ప్రతీ ఇంటిలో ఒక పెద్ద కొడుకుగా, అక్కాచెల్లెల్లకు అన్నగా, మా పిల్లలకు మేనమామగా ముందుండి నడిపిస్తున్నారు. మా సొంత ఇంటి కల నెరవేరింది. మా మహిళా సంఘాల తరపున మీకు కృతజ్ఞతలు. మాలాంటి కుటుంబాలు సంతోషంగా ఉన్నారంటే మీరే కారణం. మీరు దిశ యాప్‌ తెచ్చి మా మహిళలకు ధైర్యాన్నిచ్చారు. మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. 


*సైమన్, లబ్ధిదారుడు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, కాకినాడ*


అన్నా మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వేట నిషేద సమయంలో మత్స్యకార భరోసా ఇస్తామన్నారు. కానీ మీరు ఇచ్చిన మాట మేరకు మా మత్స్సకారులకు మా అందరికీ రూ. 10 వేలు ఇచ్చారు. గతంలో మాకు రూ. 4 వేలు మాత్రమే ఇచ్చేవారు. మా బాధలను మీరు గుర్తించి ప్రతీ ఏడాది రూ. 10 వేలు ఇస్తున్నారు. గడిచిన రెండేళ్ళుగా మాకు అందింది. కానీ ఈ ఏడాది నా అకౌంట్‌ సరిగా లేకపోవడం వల్ల రాలేదు. కానీ గ్రామ సచివాలయానికి వెళ్ళి రాలేదని చెప్పగానే వాళ్ళు వెంటనే సరిచేశారు. మా మత్స్యకారులకు మీరు గొప్ప ఉపకారాలు చేశారు. మీరు మాకు ఆయిల్‌ సబ్సిడీ ఇస్తున్నారు. లీటర్‌కు రూ. 9 తగ్గించి డీజిల్‌ పోస్తున్నారు. నెలకు రూ. 2700 ఆయిల్‌ సబ్సిడీ ద్వారా మిగులుతుంది. మా కాకినాడ జిల్లాలో ఒకటే ఫిషింగ్‌ హార్బర్‌ ఉండేది, మీరు మా కోసం ఉప్పాడలో ఫిషింగ్‌ హార్బర్‌ పెడుతున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉన్నాం. మాకు అమ్మ ఒడి పథకం ద్వారా కూడా లబ్ధి జరుగుతుంది. మీరు ప్రభుత్వ పాఠశాలను ప్రేవేట్‌ స్కూల్స్‌కి పోటీగా తీర్చిదిద్దారు, మా మత్స్యకార పిల్లలు కూడా మీ వల్ల ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు. మా కుటుంబం చాలా లబ్ధి పొందింది. మీరు మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మీరు పేదవాడిని గుర్తించి మాకు న్యాయం చేస్తున్నారు. మేం పెద్దగా చదువుకోకపోయినా మాకు మంచి అధికారులను ఇచ్చి సాయం చేస్తున్నారు. మాకు ఇన్ని పథకాలు ఉన్నాయని గతంలో తెలీదు, మీరు వచ్చిన తర్వాతే తెలిశాయి, మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Comments