ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి


నెల్లూరు (ప్రజా అమరావతి);నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి ఎన్. చక్రధర్ బాబు, సంబంధిత అధికారులను  ఆదేశించారు.


మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం  మండల పరిధిలోని నాగమాంబపురం,  కట్టుబడిపాలెం గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో  చేపట్టిన  ఇళ్ళ నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్,  నాగమాంబపురం వద్ద జగనన్న కాలనీలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి, ఆగస్టు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లే అవుట్లో మొత్తం 60 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని,  అందులో బిలో బేస్మెంట్ స్థాయిలో 8, బేస్మెంట్ స్థాయిలో 25 ,రూఫ్ లెవెల్ లో 12, స్లాబ్ వేసినవి 15 గృహాలు మొత్తం 60 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని గృహనిర్మాణ శాఖ ఏ.ఈ, జిల్లా కలెక్టర్ కు వివరించారు. వివిధ దశల్లో వున్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను, కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలను అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి  ఎప్పటికప్పుడు స్టేజీ అప్డేషన్ చేయాలన్నారు. తుది దశ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.  లేఅవుట్ నందు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడి లబ్ధిదారులను ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్  అడిగి తెలుసుకున్నారు.


అనంతరం జిల్లా కలెక్టర్ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ పరిధిలోని  కట్టుబడిపాలెం జగనన్న కాలనీలో  చేపట్టిన  ఇళ్ళ నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు పరిశీలించారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటి కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, మండల ప్రత్యేక అధికారిని, హౌసింగ్ అధికారులను, మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.  రోజువారీ లక్ష్యాలను నిర్ధేశించుకొని ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయుటకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. 


జిల్లా కలెక్టర్ గారి వెంట మండల ప్రత్యేక అధికారి, సమగ్ర శిక్ష పిఓ శ్రీమతి ఉషా రాణి, హౌసింగ్ పిడి శ్రీ నరసింహులు, మునిసిపల్ కమీషనర్ శ్రీ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి,  ఎంపీడీఓ శ్రీ నరసింహా రావు, హౌసింగ్ ఈ ఈ శ్రీ గౌస్ మోహిద్దీన్, విద్యుత్ శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments