శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిశ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):

       ఈ రోజు ది. 13-08-2022న మహామండపము నాలుగవ అంతస్థు నందు ఆలయ కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం నందు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారి ఆధ్వర్యంలో ఆలయములోని అన్ని విభాగముల అధికారులతో దసరా మహోత్సవములు -2022 (ది.26-09-2022 నుండి ది.05-10-2022 వరకు) సందర్భముగా భక్తుల సౌకర్యార్థం వివిధ విభాగముల వారు చేపట్టవలసిన చర్యలు మరియు ఏర్పాట్ల పై సమావేశమై చర్చించారు.


      త్వరలో గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో దసరా మహోత్సవముల అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరుగును.


శ్రీ అమ్మవారి అలంకార వివరములు:


1. 26-09-2022 సోమవారం - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి స్వర్ణకవచాలంకృత దేవి


2. 27-09-2022 మంగళ వారం - ఆశ్వయుజ శుద్ధ విదియ బాలా త్రిపుర సుందరీ దేవి


3. 28-09-2022 బుధ వారం -  ఆశ్వయుజ శుద్ధ తదియ గాయత్రీ దేవి


4. 29-09-2022 గురు వారం - ఆశ్వయుజ శుద్ధ చవితి అన్నపూర్ణ దేవి


5. 30-09-2022 శుక్ర వారం -  ఆశ్వయుజ శుద్ధ పంచమి లలితా త్రిపుర సుందరీ దేవి


6. 01-10-2022 శని వారం -  ఆశ్వయుజ శుద్ధ షష్టి మహాలక్ష్మి దేవి


7. 02-10-2022 ఆది వారం -  ఆశ్వయుజ శుద్ధ సప్తమి  

(మూలా నక్షత్రం) సరస్వతీ దేవి


8. 03-10-2022 సోమవారం -  ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గా దేవి


9. 04-10-2022 మంగళవారం -  ఆశ్వయుజ శుద్ధ నవమి మహిషాసురమర్దిని


10. 05-10-2022 బుధవారం -  ఆశ్వయుజ శుద్ధ దశమి రాజరాజేశ్వరి దేవి


ఈ సమావేశము నందు ఆలయ వైదిక కమిటీ సభ్యులు శ్రీ లింగంభోట్ల దుర్గాప్రసాద్ గారు, శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి గారు, కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కే.వి.ఎస్ కోటేశ్వర రావు గారు, శ్రీమతి లింగం రమాదేవి గారు, సహాయ కార్యనిర్వహణాధికార్లు శ్రీమతి పి.సుధారాణి గారు, శ్రీ పి.చంద్రశేఖర్ గారు, శ్రీ బి.వెంకట రెడ్డి గారు, శ్రీ ఎన్.రమేష్ గారు, శ్రీ రాజేంద్ర కుమార్ గారు,  ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు,  పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.Comments