చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన కుప్పం నియోజకవర్గ ప్రజలు



 *-చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన కుప్పం నియోజకవర్గ ప్రజలు* 


 *- ధ్వంసం చేసినా పేదల ఆకలి తీరుస్తున్న చంద్రబాబు* 

 *- వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న బలమైన నేతలు* 

 *- వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన శిష్ట్లా లోహిత్* 


కుప్పం, చిత్తూరు జిల్లా, ఆగస్టు 27 (ప్రజా అమరావతి): మూడు రోజుల కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. అడుగడుగునా మహిళలు చంద్రబాబుకు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారని ఆయన తెలిపారు. చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత కురుస్తున్న చినుకుల వర్షంలో నేను సైతం తోడుగా అంటూ ఆయనకు శిష్ట్లా లోహిత్ గొడుగు పట్టారు. చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ గత 33 ఏళ్ళుగా చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన కుప్పం పర్యటనలో వైసీపీ శ్రేణులు అలజడి సృష్టించే ప్రయత్నం చేశాయన్నారు. కుప్పం మోడల్ కాలనీలో 650 ఇళ్ళను నిర్మించి, ఆ కాలనీని చంద్రబాబు ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. చంద్రబాబు పాలనలో రౌడీమూకల దాడులు జరగలేదని చెప్పారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేయడం దారుణమన్నారు. టీడీపీ ఫ్లెక్సీలను ఇష్టానుసారంగా చింపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారన్నారు. అన్నా క్యాంటీన్ ను టీడీపీ శ్రేణులు పునర్నిర్మించాయని, దీంతో చంద్రబాబులో మరింత ఉత్సాహం కన్పించిందన్నారు. అన్నా క్యాంటీన్లోకి చంద్రబాబు స్వయంగా వెళ్ళి పేదలకు భోజనం వడ్డించారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి కుప్పం ఘటనలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గంలో అల్లరి మూకల నుండి రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజా సంగ్రామంలో చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు చంద్రబాబుకు తోడుగా నిలుస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బలమైన నాయకులను బరిలోకి దించుతానని కుప్పం పర్యటనలో చంద్రబాబు స్పష్టం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పంలో మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారని శిష్ట్లా లోహిత్ పేర్కొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image