జిల్లాలో అంతర్జాల వ్యవస్థ ని ఉపయోగించుకొని ఆప్కో చేనేత వస్త్రాలను అమ్మకాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి..

  రాజమహేంద్ర వరం (ప్రజా అమరావతి);


*  జిల్లాలో అంతర్జాల వ్యవస్థ ని ఉపయోగించుకొని ఆప్కో చేనేత వస్త్రాలను అమ్మకాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి..
*  ఉదయం 9.00 గంటలకు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు 


* జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు, ఆప్కో ఎగ్జిబిషన్  సేల్స్ కౌంటర్ ను ప్రారభించిన జిల్లా కలెక్టర్, డా. కె. మాధవిలత. 


జిల్లాలో  టెక్నాలజీ ని ఉపయో గించు కొని ఆప్కో చేనేత వస్త్రాలను అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని డా. కె. మాధవిలత అన్నారు.  ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక నేత బజార్ వద్ద ఆప్కో ఎగ్జిబిషన్  సేల్స్ కౌంటర్ ను మాధవిలత ప్రారభించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ 1905 వ సంవ త్సరములో స్వదేశీ ఉద్యమా నికి గుర్తుగా ఆగస్టు 7 వ తేదీన 

జాతీయ చేనేత దినోత్సవంగా ఎంచుకోవడం జరిగిందన్నారు.  చేనేత పరిశ్రమ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే లక్ష్యం తో భారత ప్రభుత్వం 2015 వ సంవత్సరం ఆగస్టు 7 వ తేదీని చేనేత జాతీయ దినోత్సవం గా ప్రకటించడం జరిగిందన్నారు 

ప్రతీ సంవత్సరం జాతీయ చేనే త దినోత్సవం ఆగస్టు7 వ తేదీ న జరుపుతున్నట్లు తెలిపారు.   తూర్పు గోదావరి జిల్లా లో చేనేత వ్యాపారులను ప్రోత్సహించడానికి రెండు క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.  ఎ. పి.లో ఆప్కో వస్త్రా లు, చీరలు, హేండ్లుమ్స్ కి మంచి మార్కెట్ ఉందని, అమెజాన్ సంస్థతో కూడా టైయప్ చేసుకో వడం జరిగిందన్నారు.   ప్రభుత్వం చేనేత కార్మి కులకు గతం లో 55 సంవత్సరాల వారికి పెన్షన్ ఉండేదని, మన  ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు 50 సంవత్సరాలకు కుదించడం  జరిగిందన్నారు. ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందని,  జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు.  తొలుత ఆప్కో అధికారులు, చేనేత కార్మికుల తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రదర్శనలో ఉంచిన వస్త్రాలను కలెక్టర్ పరిశీలన చేశారు. అజాది కా అమృత్ మహోత్సవ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆప్కో వస్త్రాలు కొనుగోలు చేసి జాతీయ భావాన్ని కలిగి ఉండాలని కోరారు. తద్వరా చేనేత కార్మికులను ప్రోత్సహించిన వారం అవుతామని తెలిపారు.


ఈ సందర్బంగా ఆప్కో డివిజినల్ మార్కటింగ్ అధికారి యల్. రామకృష్ణ మూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేనేత కార్మి కుల అభివృద్ధి సంక్షేమo కోసం నేతన్న నేస్తం పధకం ద్వారా చేనేత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి సంవ త్సరానికి 24 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ మన రాష్ట్రంలో చేనేత కుటుంబాలు మెరుగైన జీవనాన్ని కొనసాగించేలా తోడ్పాటు ఇస్తున్నట్లు తెలిపారు. ఆగస్ట్ నెల 7 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ఆప్కో కం ఎగ్జిబిషన్ కం అమ్మకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు..వస్త్ర ప్రియు లు, వినీయోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,  చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా చేనేత వృత్తిలో ఉన్న ఐదుగురు చేనేత కార్మికులను కలెక్టర్ సన్మానించారు.


ఈ కార్యక్రమం లో జిల్లా చేనేత అభివృద్ధి అధికారులు కృష్ణ భాస్కర్, కె. నాయుడు, గణేష్, సహాయ అభివృద్ధి అధికారి, సత్యవేణి, సీనియర్ మేనేజర్, బి. విజయ భాస్కర్, తదితరు లు పాల్గొన్నారు.

Comments