దేశభక్తి భావం పెంపొందించే విధంగా చిత్రప్రదర్శనను ఏర్పాటు

 


నెల్లూరు ఆగస్టు 5 (ప్రజా అమరావతి):-- ఆజాదీ కా  అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 తేదీ ఉదయం 10:30 గంటలకు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో దేశభక్తి భావం పెంపొందించే విధంగా చిత్రప్రదర్శనను ఏర్పాటు


చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్  శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 


 ఈ చిత్ర ప్రదర్శనలో దేశంలోని,రాష్ట్రంలోని స్వాతంత్ర్య సమరయోధులు, స్వాతంత్ర్య పోరాట ఘట్టాలు, జాతీయ పతాకం  రూపకల్పన, జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, పురాతన చారిత్రాత్మక కట్టడాలు తదితర అంశాలపై చిత్రాలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 


కావున జిల్లా ప్రజలు ముఖ్యంగా భావిభారత పౌరులైన  పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరారు.

Comments