అర్హత గల వారందరికీ జగనన్న వీదేశి విద్యా దీవెనె పధకం అమలు..

 

విజయవాడ, (ప్రజా అమరావతి);

* అర్హత గల వారందరికీ జగనన్న విద్యా దీవెనె పధకం అమలు.. 


* ఈ పధకం క్రింద ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పిస్తున్నాం.. 

* రాష్ట్రంలో మూడేళ్ళ కాలంలో కాపుల కోసం వివిధ పధకాల క్రింద రూ. 32 వేల కోట్లు అందించాం.. 

* కాపు నేస్తం పధకం ద్వారా రూ. 1500 కోట్లు అందించాం.. 

- కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అడపా శేషగిరి..  

రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన  ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల వారికి విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవడానికి " జగనన్న విదేశీ విద్యా దీవెనె  పధకం "  ఒక వరమని  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అడపా శేషగిరి (శేషు) అన్నారు. 

మంగళగిరి కాపు కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ వెనుకబడిన, మధ్య తరగతి  కుటుంబాల విద్యార్థులకు విదేశీ విద్య ఒక కలలా మిగిలిపోయిందని అటువంటి కలలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అర్హత గల ప్రతి ఒక్కరికీ విదేశీ విద్య అందించేందుకు " జగనన్న విదేశీ విద్యా దీవెనె " పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు.  దరఖాస్తు చేసుకునే అభ్యర్థి రూ. 8 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలన్నారు.  విదేశాలలో పిజి కోర్సులు, పిహెచ్ డి, ఎంబిబిఎస్ కోర్సులు చదవడానికి అవకాశం కల్పించామన్నారు.  ప్రపంచ ర్యాంకు 1 నుంచి 100 వరకు యూనివర్సిటీలలో ఎంపికైన విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని, 101 నుండి 200 ర్యాంకులు ఉన్న యూనివర్సిటీలలో ఎంపికైన విద్యార్థులకు రూ. 50 లక్షలు, లేదా ట్యూషన్ ఫీజులో 50% వరకూ చెల్లిస్తారని అయన అన్నారు.  పిజి కోర్సులో ప్రవేశించే వారికి 60% మార్కులు లేదా సమాన  గ్రేడ్ పొంది ఉండాలన్నారు.  పిహెచ్ డి చేసే విద్యార్థులు పిజి కోర్సులో 60% మార్కులు లేదా సమాన  గ్రేడ్ పొంది ఉండాలన్నారు.  ఎంబిబిఎస్ కోర్సు లో చేరే విద్యార్థులు ఇంటర్ మీడియేట్ లేదా సమాన కోర్సులలో 60% మార్కులు పొంది ఉండాలన్నారు.  అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.   http://jnanabhumi.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  వివరాలు, సందేహాలు నివృత్తి కొరకు 6305448393, 6305159559 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని అడపా శేషు అన్నారు.

జగనన్న విదేశీ విద్యా దీవెనె పధకం పొందగోరే విద్యార్థులు TOEFL//IELTS/GRE/GMAT పరీక్షలందు అభ్యర్థి అర్హతకు సమాన స్కోర్ సాధించి ఉండాలని, ఈ పధకానికి దరఖాస్తు చేయడానికి ముందే వీసా మరియు పాస్ పోర్ట్ పొంది ఉండాలన్నారు.  జగనన్న విదేశీ విద్యా దీవెనె పధకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 35 సంవత్సరాల వయస్సు దాట కూడదని, ఆంధ్ర ప్రదేశ్ నేటివిటీ కలిగి ఉండాలని, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పధకానికి అర్హులని అయన అన్నారు.  అర్హత గల అభ్యర్థులు ఈ సంవత్సరంలో ఆగష్టు 1 నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

రాష్ట్ర  ప్రభుత్వం కాపు కల్యాణ మండపములు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ 54వ వార్డులో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మించుటకు కోటి రూపాయలు మంజూరు చేసి నిధులు విడుదల చేయడమైనదని శ్రీ శేషు చెప్పారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతములో ఉన్న చింతూరు, కూనవరం, ఆటపాక, కుకునూరు, వేలేరుపాడు, బూరగంపాడు మొదలగు 6 మండలాలకు చెందిన మున్నూరు కాపు ప్రజలకు ఇతర జిల్లాలో ఉన్న కాపు కులస్తుల మాదిరి వారికి ఓ.సి. కులముగా సర్టిఫికెట్ లు ఇస్తుంన్నందున అనేక ప్రభుత్వ పథకాలలో లబ్దిని పొందలేక ఇబ్బంది పడుతున్నారని శ్రీ శేషు చెప్పారు.  ఈ విషయమై ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లామన్నారు.  ఈ మండలాలకు చెందిన మున్నూరు కాపు ప్రజలకు బి.సి.(డి) సర్టిఫికెట్ లు ఇవ్వవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసి ఆదుకున్నారని  తెలిపారు.  ఈ సందర్భంగా 6 మండలములకు చెందిన కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి సామజిక వర్గాల ప్రజలు ముఖ్యమంత్రికి  కృతఙ్ఞతలు తెలియజేసారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తెలిపారు.

రాష్ట్రంలో గత మూడేళ్ళ కాలంలో కాపుల సంక్షేమానికి వివిధ ప్రభుత్వ  పథకాల ద్వారా రూ. 32 వేల కోట్లు అందించామన్నారు.  కాపు నేస్తం క్రింద కాపు మహిళలకు రూ. 1500 కోట్లు అందించామన్నారు.  కాపు కార్పొరేషన్ ద్వారా త్వరలో రుణాలు అందిస్తామని చైర్మన్  అడపా శేషు అన్నారు.  ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ శ్రీ బి. ధనుంజయుడు, తదితరులు పాల్గొన్నారు.        


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image