సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి.



*జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*



అమరావతి (ప్రజా అమరావతి);

*జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌*

*ఉపాధిహామీ పనులు, విద్య, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు, ఇళ్లపట్టాలు, గృహనిర్మాణం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష,  స్పందన తదితర అంశాలపై సీఎం సమీక్ష.*


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...*

*ఉపాధి హామీ పథకం*

– ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించింది :

పనితీరు బాగుంది:

– రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోంది:

– రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్న అన్నమయ్య, విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కాస్త దృష్టిపెట్టాలి:

– ఈ వేగం ఇంకా కొనసాగాలి:

–ఉపాధి హామీలో మనం దేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం:

అదే విధంగా పనితీరు కనపర్చాలి :

– సగటున వేతనం పెరగాల్సిన అవసరం ఉంది:

– కనీసంగా సగటున ఉపాధిహామీ వేతనం రూ.240లు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:

– ప్రస్తుతం రూ. 205లుగా సగటున ఉంది, దీన్ని రూ.240లకు చేర్చాలి: 


*త్వరితగతిన నిర్మాణ పనులు...* 

సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి:


ఇవి గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్పు చేస్తాయి : 

వీటి పనులకు అత్యంత ప్రాధాన్యత:

పనులను వేగవంతం చేయడంతో పాటు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి :

– గ్రామ సచివాలయాల భవనాలు త్వరగా పూర్తిచేయాలి:

– కలెక్టర్లు వీటిపై శ్రద్ధపెట్టాలి:

– ఆర్బీకేలు నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి :

– వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పూర్తిచేయడంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి:

– వీటి నిర్మాణానికి కలెక్టర్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి :

– ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌...

అక్టోబరు 31 నాటికల్లా వీటి నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోండి:

– డిసెంబరు నాటికి 4500 గ్రామాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ చేరుతుంది:

– మంజూరుచేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్‌ నెలాఖరునాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి:

– వీటితోపాటు గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉంటాయి:

– ఇవన్నీ కూడా గ్రామాల స్వరూపాన్ని మారుస్తాయి:

– ప్రతి సచివాలయాన్నీ ఒక యూనిట్‌గా తీసుకుని ఈ పనులు పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి:

– కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకూ కూడా వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సి ఉంది:

మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి :


*స్కూళ్ల, ఆస్పత్రుల నిర్వహణపై ఫిర్యాదులకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లు:*


– రెండో దశ కింద ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు – నేడుసహా, ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి :

–  మొదటి విడతలో 15, 715 స్కూళ్లను బాగుచేశాం :

– రెండో విడత కింద 22,279 స్కూళ్లలో  నాడు – నేడు కింద పనులు చేపట్టాం:

– ఇక్కడ చేస్తున్న పనులు నాణ్యంగా ఉండాలి:

– చేస్తున్న పనులు పట్ల కలెక్టర్లు నిశితపరిశీలన చేయాలి:

– అక్కడక్కడా మిగిలిపోయిన చోట్లకూడా నెలాఖరు నాటికి అన్ని స్కూళ్లలో కూడా పనులు ప్రారంభంకావాలి:

– నాడు – నేడుకు నిధులు కూడా సకాలంలో అందిస్తున్నాం:

– ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది:

– అలాగే ఆస్పత్రుల్లో పనుల పట్లకూడా ఇదే తీరున పరిశీలన చేయాలి:

– ప్రతివారంకూడా జరుగుతున్న పనులపట్ల వివరాలు తెప్పించుకోండి:

– ఎక్కడైనా సమస్యలు ఉంటే.. వాటిని వెంటనే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోండి:

– అలాగే స్కూళ్ల నిర్వహణ మరమ్మతులు(ఎస్‌ఎంఎఫ్‌), టాయిలెట్ల శుభ్రతకోసం ఏర్పాటు చేసిన నిధులు అందుబాటులో ఉన్నాయి:

– ఏదైనా సమస్య వస్తే వెంటనే వాటిని బాగుచేయించండి:


– స్కూళ్ల నిర్వహణపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్‌ను స్కూళ్లలో డిస్‌ప్లే చేయండి:

– ఈ నంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వెంటనే మరమ్మతు చేయించండి:

– ప్రతి ఆస్పత్రి, ప్రతి స్కూళ్లలో కూడా నిర్వహణపైన ఫిర్యాదుల స్వీకరణకు ఈ నంబర్‌ను ఉంచండి:

– పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు ఇలా ప్రతిచోటా కూడా ఈ ప్రత్యేక నంబర్‌ ఉంచాలి:

– పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక మెడికల్‌కాలేజీని నిర్మిస్తున్నాం:

– దీనికి సంబంధించి పనులు జరిగేలా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి:

– సంబంధిత జిల్లాకలెక్టర్, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలి:

– దీంతోపాటు రాష్ట్రంలో 16 మెడికల్‌కాలేజీల నిర్మాణ పనులనూ కలెక్టర్లు నిరంతరం పరిశీలన చేయాలి:

– వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌కూడా వెంటనే పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి:


*గృహ నిర్మాణంపైన సీఎం సమీక్ష.*

– ఇళ్ల నిర్మాణపనులు వేగవంతం కావాలి:

– ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.3,111.92 కోట్లు ఖర్చు చేశాం:

– ఇళ్లను పూర్తిచేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్దపెట్టి పనిచేస్తోంది.

– కలెక్టర్లు కూడా వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి:

– రెండో విడత కింద మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణంపైన దృష్టిపెట్టాలి 


– విశాఖలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి:

– ఆయా లే అవుట్లలో ఇళ్ల నిర్మాణంకోసం అనిరకాలుగా సిద్ధంచేయండి:

– లెవలింగ్‌ పనులతోపాటు కరెంటు, నీటి సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకోండి:


–  ఆప్షన్‌ –3 ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు శ్రద్ధపెట్టాలి:

– ఈ ఇళ్లనిర్మాణం పనులనూ వేగవంతం చేయాలి:

– 10వేలకుపైగా ఇళ్లు  విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, అలాగే పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించాల్సిన ఏలూరు లే అవుట్లపై సంబంధిత కలెక్టర్లు దృష్టిపెట్టాలి.


– కాలనీలు పూర్తయ్యే సమయానికి కరెంటు, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను కల్పించాలి:

– కాలనీలు పూర్తయ్యేనాటికి ఈ సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి:

– సంబంధిత శాఖలు దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి:


– ఇప్పటివరకూ ఇచ్చిన ఇంటిపట్టాలపై ఒక్కసారి పరిశీలన చేయండి:

– లబ్ధిదారులకు పట్టాలు అందాయా? లేవా? వారి పొజిషన్‌కు అప్పగించామా? లేదా? అన్నది అధికారులు ఒక్కసారి పరిశీలనచేయాలి.

– ఎక్కడైనా అలా జరగకపోతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి:

– వారి స్థలంలో లబ్ధిదారుడు పట్టాతో ఉన్న ఫొటోను కూడా తీసుకోవాలి:

– ఈ రకంగా ఈనెలాఖరు నాటికి ఆడిట్‌ పూర్తిచేయాలి:

– 90 రోజుల్లోగా ఇంటిపట్టాలు అందించే కార్యక్రమాన్నికూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిశీలన చేయాలి:

– లబ్ధిదారులుగా గుర్తించిన వారికి ఇప్పటికే ఉన్న సంబంధిత లే అవుట్లలో ఖాళీగా ఉన్న చోట్ల పట్టాలను వీరికి వెంటనే కేటాయించండి, అవసరమనుకుంటే వెంటనే భూ సేకరణ చేసి వారికి పట్టాలు ఇవ్వండి:

– భూ సేకరణ విధానంలో స్వాపింగ్‌ విధానాన్ని వినియోగించుకోండి. కుదరని చోట భూమి కొనుగోలుచేసి వారికి పట్టాలు ఇవ్వండి:



*అక్టోబరు 1 నాటికి 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు పత్రాలు:*

తర్వాత ప్రతినెలా వేయి గ్రామాల చొప్పున భూ హక్కు పత్రాలు:

– జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష కార్యక్రమం అత్యంత కీలకమైనది:

– చరిత్రలో ఒక అధ్యాయాన్ని సృష్టిస్తుంది:

– సర్వేకు సంబంధించి ఓఆర్‌ఐ జనరేషన్, గ్రౌండ్‌ సర్వే, నోటిఫికేషన్‌ జారీ, జగనన్న భూ హక్రు పత్రాల పంపిణీ అనే నాలుగు కీలక దశలు ఉన్నాయి:

– ప్రతి అంశం పలానా తేదీలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం:

– కలెక్టర్ల సమగ్ర పర్యవేక్షణ ఉండాలి:

– అక్టోబరు 2నాటికి వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు మరియు భూ రక్షసర్వే పూర్తికావాలి. సంబంధిత వ్యక్తుల చేతిలో జగనన్న భూ రక్ష హక్కు పత్రాలు ఇవ్వాలి:

– అక్టోబరు తర్వాత ప్రతినెలలోనూ వేయి గ్రామాల్లో సర్వే పూర్తిచేసి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలి:

– అంతిమంగా ప్రతి గ్రామ, వార్డుసచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం.


*స్పందన వినతులపైనా...*

– స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యం:

– వినతులను ఎలా పరిష్కరిస్తున్నారన్నదానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి:

– గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కార్యక్రమంగా కచ్చితంగా జరగాలి:

– సంబంధిత సిబ్బంది కచ్చితంగా ఆ సమయంలో అందుబాటులో ఉండాలి:

– ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలి:

– సంబంధిత అధికారులు కచ్చితంగా స్పందనలో పాల్గొనాలి:

– కలెక్టర్లు కచ్చితంగా ఇది అమలు జరిగేలా చూడాలి:

– ప్రతి బుధవారం .. స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి:

– ప్రతి గురువారం చీఫ్‌సెక్రటరీ జిల్లాకలెక్టర్లతో స్పందనపై సమీక్షచేయాలి. 


అదే సమయంలో సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ పైనా రివ్యూ చేయాలి:

– స్పందన వినతులపై క్షేత్రస్థాయి పర్యటనలు అవసరం :

– ఇవి కచ్చితంగా జరిగేలా చూడాలి:


*సచివాలయాల్లో ప్రాధాన్యతా పనులకు రూ.3వేల కోట్లు:*

–గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారు:

ఒక సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు పర్యటిస్తున్నారు :

– ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు:

– ప్రజలనుంచి వచ్చిన వినతుల ఆధారంగా అందులో ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటిపైన ఒక విజ్ఞప్తిని సంబంధిత ఎమ్మెల్యే పంపిస్తున్నారు:

– ఈ ప్రాధాన్యతా పనులను పూర్తిచేయడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల రూపాయలను కేటాయించాం:

– ఈ పనులు చేపట్టేలా, యద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది :

– వేగంగా పనులు చేపట్టడమే కాదు, వాటిని అంతే వేగంతో పూర్తిచేయాలి:

– నిర్ణీత కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలి  :

అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది :

– దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనులకోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం:

– గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలి. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, సమన్వయ పరచడానికి అవగాహన ఏర్పడుతుంది:

స్పందన కార్యక్రమాన్ని నేనే నేరుగా పర్యవేక్షిస్తాను  :



*వృద్ధిరేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరం:*


– 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరం :

– దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది :

– కీలక రంగాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి:

– పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా:

– కలెక్టర్లందరినీ అభినందిస్తున్నా:

– ఈ వృద్ధి నిలకడగా కొనసాగాల్సిన అవసరం ఉంది:

–  ఎంఎస్‌ఎంఈ రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి:

– ఈ రంగం నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సక్రమంగా పరిష్కరించాలి :

ప్రతి పథకం ఎస్‌డీజీతో ముడిపడి ఉంటుంది :

అర్హులకు ప్రతి ఒక్కరికీ అందాలి:

వాటిని సక్రమంగా పర్యవేక్షణ చేస్తే... యధావిధిగా ఎస్‌డీజీ పెరుగుతుంది :



*జాతీయ రహదారులు–  భూసేకరణ*

– రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 99 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి:

3079 కిలోమీటర్ల మేర రూ. 29,249 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయి. 

– అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల అనుసంధానం కోసం మరో 7 ప్రాజెక్టులు కూడా చేపడుతున్నాం:

– డీపీఆర్‌ స్థాయిలో మరో 45 ప్రాజెక్టులు ఉన్నాయి:

– మొత్తంగా 151 ప్రాజెక్టులు దాదాపు రూ.92 వేలకు పైగా కోట్లు ఈ ప్రాజెక్టులకోసం ఖర్చుచేస్తున్నాం:

– ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:

– రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి:



*దిశ :*

ప్రతి ఇంటిలో ఉన్న మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ ఉండాలి  :

ప్రతి వాలంటీర్, మహిళా పోలీసు సహకారంతో దిశ యాప్‌ను ప్రతి మహిళ మొబైల్‌లో డౌన్లోడ్‌ చేయించాలి  :

ప్రతి 15 రోజులకొకమారు దిశ యాప్‌ పనితీరును కూడా పర్యవేక్షించాలి  :

ఎస్‌ఓఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేయడం ద్వారా కానీ, ఫోన్‌ను షేక్‌ చేయడం ద్వారా దిశ యాప్‌ను యాక్టివేట్‌ చేస్తూ.. పోలీసుల ప్రతిస్పందనను కూడా గమనించాలి  :

అప్పుడే ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది  :

అందుకే ఎస్పీ, కలెక్టర్, జేసీ స్ధాయిలో ఈ తరహా మాక్‌ట్రైల్స్‌ను నిర్వహించాల్సి ఉంటుంది :

ఇది చాలా పెద్ద కార్యక్రమం  :

అన్ని స్కూళ్లు, కాలేజీలపై ధ్యాస పెట్టండి  :

యూనివర్సిటీలపైనా దృష్టి పెట్టాలి  :

డ్రగ్స్, నార్కోటిక్స్, అసాంఘిక కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టాలి  :

ప్రతి కాలేజీలోనూ, యూనివర్సిటీలోనూ ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలపై రిపోర్టు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి  :

అందరికీ కనిపించేలా హోర్డింగ్‌లు ప్రతి కాలేజీ, యూనివర్సిటీ ముందు ఏర్పాటు చేయాలి  :

అక్రమ మద్యం, జూదం, నార్కోటిక్స్‌ వీటికి సంబంధించిన  ఫిర్యాదుల కోసం ఎస్‌ఈబీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి  :

వీటిపై కఠినంగా వ్యవహరించాలి  :

వారానికి ఒక్కసారి కనీసం జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశం కావాలి  :

ఈ తరహా కార్యకలాపాలపై చర్చించాలి  :

ఇది చాలా ముఖ్యమైన అంశం  : 

వచ్చే సమావేశం నాటికి ప్రతి కాలేజీ, యూనివర్సిటీలోనూ ఈ నంబర్‌తో హోర్డింగ్‌లు ఏర్పాటు కావాలి  :


*ఆగష్టు, సెప్టెంబరు నెలలో కార్యక్రమాలు..*

– ఈనెల 25న, ఎల్లుండి నేతన్న నేస్తం

– వచ్చేనెల 22న వైయస్సార్‌ చేయూత కార్యక్రమం.


స్పందన వీసీలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం,  సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి,  పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్లానింగ్‌ సెక్రటరీ విజయ్‌ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments